నిర్మాత కొడుకు గా
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన
బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మంచి మంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. పెద్ద పెద్ద హీరోయిన్లతో మాత్రమే నటించే
బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవలే అల్లుడు
అదుర్స్ పెద్ద ఫ్లాప్ ను అందుకుని ప్రేక్షకులను ఏమాత్రం మేప్పించలేకపోయాడు. దాంతో ఆయన మంచి హిట్ కోసం ఎదురుచూస్తుండగా చత్రపతి
రీమేక్ చేసే అవకాశం వచ్చింది. నిజానికి
బెల్లంకొండ శ్రీనివాస్ కి
టాలీవుడ్ లో భారీ హిట్ మాత్రం దక్కలేదనే చెప్పాలి. రాక్షసుడు
సినిమా కొంతవరకు హిట్ అయినా అది
రీమేక్ సినిమా కావడంతో ఆ హిట్టు బెల్లంకొండ ఖాతాలోకి రాలేదు.