ఒక్కపుడు ఫుడ్ సెంటర్ లో పని.. ఇప్పుడు స్టార్ హీరో..!!
విజయ్ సేతుపతి డబ్బింగ్ సినిమాలతో దగ్గరైనప్పటికీ ఆయన ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి నేరుగా అడుగుపెట్టారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. అంతేకాదు.. విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రంలో వేసిన రాయనం పాత్ర ఎంతో పేరు, గుర్తింపుని తీసుకొచ్చింది.
ప్రస్తుతం విజయ్ సేతుపతి మాస్టర్ చెఫ్ అనే ఓ టీవీ ప్రోగ్రాంలో యాంకర్గా చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ' నాకు వంటలంటే ఎంతో ఇష్టం. ఆయన జీవితంలో చాలా కష్టాలు పడ్డానని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. కాలేజీ రోజుల్లో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసేవాడిని.. సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 12:30 గంటలవరకు అక్కడే పనిచేసి.. అక్కడే భోజనం కూడా చేసేవాడిని అని తెలిపారు.
అయితే విజయ్ కి ఇష్టమైన వంట ఉల్లి సమోసా. ప్రస్తుతం ఈ స్నాక్ ఎక్కడా దొరకడం లేదని ఆయన అన్నారు. కాగా.. ఇంట్లో ఉంటే మాత్రం సాయంత్రం పూట ఉల్లి సమోసా తిని ఓ టీ తాగుతా' అంటూ తన జీవితంలో ఎదురైన ఘటనలను ఆయన ఈ సందర్బంగా పంచుకున్నారు. ఇక మాస్టర్ చెఫ్ ప్రోగ్రాంపై తమిళప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. అయితే అందుకు కారణం సేతుపతి హోస్ట్గా చేయడమే. విజయ్ పలు తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు.