ప్రభాస్ ఆ ఒక్క నిర్ణయం.. 150 కోట్లు లాస్..!

shami
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నేషనల్ స్టార్ గా సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా రెండు పార్టులతో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు తన ప్రతి సినిమా పాన్ ఇండియా వైడ్ ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్. ఈ క్రమంలో బాహుబలి తర్వాత వచ్చిన సాహో పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే హిందీ ఆడియెన్స్ కు మాత్రం సాహో బాగా నచ్చేసింది. అందుకే ఆ సినిమా అక్కడ మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ప్రస్తుతం బాహుబలి ప్రభాస్ రాధాకృష్ణ డైరక్షన్ లో రాధే శ్యాం సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే ప్రభాస్ కు జోడీగా నటిస్తుంది.

నేషనల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ కోసం పలు బ్రాండ్ లు ప్రమోషన్స్ చేయించుకోవాలని భావించాయి. బాహుబలి ప్రభాస్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటే ఆ రేంజ్ వేరేలా ఉంటుందని పలు కంపెనీలు పోటీ పడ్డాయి. కాని ప్రభాస్ వాటినన్నటినీ పక్కన పెట్టాల్సి వచ్చింది. ప్రభాస్ కు ఉన్న టైట్ షెడ్యూల్ వల్ల యాడ్స్ లో నటించే టైం దొరకట్లేదట. అందుకే యాడ్స్ వచ్చినా సరే కాదని చెప్పేస్తున్నాడట. అయితే ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 150 కోట్ల దాకా అతను లాస్ అయినట్టు తెలుస్తుంది.

పలు కంపెనీలకు చెందిన బ్రాండ్ అంబాసిడర్ గా ప్రభాస్ కు ఫ్యాన్సీ ఆఫర్స్ ఇస్తూ వచ్చాట. గత ఏడాది ప్రభాస్ ఇవన్ని చేసి ఉంటే 150 కోట్ల దాకా తన ఖాతాలో వేసుకునే వాడని లెక్కలు చెబుతున్నారు. కేవలం సినిమాల మీదే దృష్టి పెట్టిన ప్రభాస్ వాణిజ్య ప్రకటనల మీద పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. ఒకవేళ ప్రభాస్ చేస్తానంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని తనతో ప్రమోట్ చేయించుకునేందుకు రెడీగా ఉన్నాయి.  ప్రసతుతం కుదరదని చెబుతున్నా ఫ్యూచర్ లో అయినా ప్రభాస్ వాణిజ్య ప్రకటనలు చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: