నిర్మాతగా మారిన ప్రముఖ డైరెక్టర్ కుమార్తె..?
వాస్తవానికి దివ్య దీప్తి కి సినిమాలంటే మహా పిచ్చి. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే ఆమె ప్రతి రోజు షూటింగ్ స్పాట్‌కి వెళ్లేవారు. ఇక సెలవు దినాల్లో షూటింగ్ సెట్స్ లోనే గడిపేవారు. 2002వ సంవత్సరం నుంచి 2007 వరకు తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన సినిమాల దర్శకత్వ విభాగంలో పనిచేశారు. ఆ సమయంలోనే ఆమె దర్శకత్వం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. ఐతే వివాహం అనంతరం ఆమె ఇంటి పనులతో బిజీ అయిపోయారు. దీంతో దాదాపు 13 సంవత్సరాల వరకు సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చారు.
ప్రస్తుతం ఆమెకు కుటుంబ పనుల నుంచి కాస్తా విరామ సమయం దొరుకుతుండటంతో సినిమా ఇండస్ట్రీలో ఎట్టకేలకు అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే ‘కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్’ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించిన ఆమె త్వరలోనే మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఇప్పటికే కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకం లో ఒక సినిమాని ప్రకటించారు. దివ్య మొట్టమొదటగా నిర్మిస్తున్న సినిమాకి కార్తీక్ శంకర్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో ఎస్ఆర్ కళ్యాణమండపం ఫేమ్ కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత బాణీలు సమకూర్చనున్నారు. అయితే సినిమాలపై ఎంతో ఆసక్తితో నిర్మాణ బాధ్యతలను భుజాలకెత్తుకున్న కోడి రామకృష్ణ పెద్ద కూతురు దివ్యకు అంతా మంచే జరగాలని ఆశిద్దాం.