పద్ధతిగా ఉండే 'గృహాలక్ష్మి' కస్తూరి మరీ ఇంత హాటా..?

Anilkumar
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగిన కస్తూరి.. ప్రస్తుతం సీరియల్ ఆర్టిస్టుగా మారి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ.. సీరియల్ నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది.బుల్లితెర ప్రముఖ ఛానెల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న 'గృహాలక్ష్మి' అనే సీరియల్ లో ప్రధాన పాత్రలో నటిస్తుంది.ఇక ఆ సీరియల్ కి మంచి రేటింగ్స్ తో పాటు ఆడియన్స్ లో ఆదరణ దక్కడంతో నటి కస్తూరి పద్ధతి గల గృహాలక్ష్మి గా బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యింది.ఇక 1991 లో ' ఆత ఉన్ కోయిలి' అనే తమిళ సినిమాతో ఇండ్రస్టీ కి పరిచయం అయ్యింది కస్తూరి.ఆ తర్వాత 1996 లో కమలహాసన్ నటించిన భారతీయుడు సినిమాలో కమల్ చెల్లెలిగా నటించింది.


ఆ సినిమాలో 'పచ్చని చిలుకలు తోడుంటే' అనే పాటలో కస్తూరి పలికించిన హావభావాలను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు.ఇక తెలుగులో కింగ్ నాగార్జున సరసన అన్నమయ్య సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఇక ఆ తర్వాత కొంతకాలానికి పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయింది.మళ్ళీ చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇండియాకి తిరిగిచ్చింది.ఇక ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా బుల్లితెరపై తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది.ఇక తెలుగులో గృహాలక్ష్మి అనే సీరియల్ లో నటిస్తోంది.ఈ సీరియల్ లో ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తున్న కస్తూరి..ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ ని దక్కించుకుంది.


ముఖ్యంగా తమిళం, కన్నడ సినిమాలలో ఆమె అందాల ఆరబోతకి అప్పటి యూత్ ఫిదా అయ్యేవారు.అయితే కస్తూరి కి చెందిన అప్పటి గ్లామర్ ఫోటోలను కొందరు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా బయటకి తీసి.. వాటిని వైరల్ చేస్తున్నారు.ఇక తాజాగా కస్తూరి కి సంబంధించినకొన్ని హాట్ ఫోటోలను నెటిజన్స్ సోషల్ మీడియాలలో షేర్ చేసి..మన గృహలక్ష్మి చాలా హాట్ అంటూ పోస్టులు పెడుతున్నారు.టీవీల్లో కనిపించే కస్తూరి ఎలా ఉందో ఈ ఫోటోల్లో చూడమంటూ ట్యాగ్ చేస్తున్నారు నెటిజన్లు.ఈ నేపథ్యంలో కస్తూరి గ్లామర్ ఫోటోలను చూసిన కొందరు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.అయితే గృహాలక్ష్మి సీరియల్ ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుందంటే అందులో కస్తూరి పాత్రనే కీలకం అని చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: