ప్రతి ఒక్కరిని కలిగించే సినిమా.. శ్రీ హరి భద్రాచలం మూవీ..!!

P.Nishanth Kumar
టాలీవుడ్ లో స్ఫూర్తిని కలిగించే సినిమాలు ఎన్నో వచ్చాయి. సినిమాలు సమాజాన్ని మారుస్తాయి సినిమాల వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది అని నిరూపిస్తూ వందల చిత్రాలు సమాజాన్ని మేలుకొలిపే చిత్రాలుగా చిత్రీకరించబడ్డాయి.  వాటి ద్వారా ప్రజలు స్ఫూర్తి పొందారో లేదో తెలియదు గానీ  ఆ సినిమాలు మాత్రం ఎప్పటికీ టాలీవుడ్ లో నిలిచిపోతాయి. ఈ తరహా సినిమాలు ప్రేక్షకుల్లో కొంతైనా మార్పును తీసుకు రాగలిగితే అదే పదివేలు.

సమాజ మంచి కోరుతూ ప్రజలను చైతన్యవంతులు గా తీర్చిదిద్దే ఈ సినిమాలు చాలా సూపర్ హిట్ అయ్యి అవి దర్శక నిర్మాతలకు, హీరోలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకు వచ్చాయి. మరి టాలీవుడ్ లో ఆ విధంగా తెరకెక్కి ప్రజలకు ఎంతో స్ఫూర్తి ని నింపిన సినిమా  భద్రాచలం. ఈ సినిమా ఎంతోమందిలో ప్రేరణ కల్పించి వారి జీవితంలో పైకి ఎదగడానికి ఉపయోగపడింది. శ్రీహరి హీరోగా నటించిన ఈ చిత్రానికి సామాజిక బాధ్యత గల చిత్రాలు తెరకెక్కించే ఎన్. శంకర్ దర్శకత్వం వహించాడు. 

టైక్వాండో ఆట నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ పల్లెటూరి నుంచి వచ్చిన వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. పల్లెటూరులో అన్న వదిన తో ఎంతో అమాయకంగా జీవించే ఓ వ్యక్తి అనుకోని కారణాలవల్ల ఇంటిని వదిలి సిటీ కి రావాల్సి వస్తుంది. అలా సిటీకి వచ్చిన ఆ వ్యక్తి ఆ తర్వాత ఈ విధంగా ఈ ఆట నేర్చుకుని అత్యుత్తమ స్థాయి పోటీలో విజేతగా నిలిచాడు అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో వచ్చే పాట ఒకటే మరణం ఒకటే జననం అనే పాట ప్రేక్షకులను ఎంతో ఉత్తేజపరుస్తుంది. శ్రీహరి నటన నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుంది. ఈ సినిమా కు ప్రముఖుల దగ్గరినుంచి ఎన్నో ప్రశంశలు దక్కాయి. టాలీవుడ్ లో బెస్ట్ ఇన్స్పిరేషన్ మూవీస్ లో ఇది ఒకటి అని చెప్పొచు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: