సూపర్ స్టార్ మహేష్ హీరోగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర లు కలిసి నిర్మించిన భారీ సినిమా వన్ నేనొక్కడినే. లెక్కల మాస్టర్ సుకుమార్ తీసిన ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. రత్నవేలు ఫోటోగ్రఫి అందించిన ఈ సినిమాలో నాజర్, అనుహాసన్, ఆనంద్, కెల్లీ డార్జి, ప్రదీప్ రావత్ తదితరులు ముఖ్య పాత్రలు చేసారు.
2014 సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలయింది. గౌతమ్ అనే పాప్ సింగింగ్ రాక్ స్టార్, చిన్నప్పుడే తన తల్లితండ్రులను విలన్ చంపేయడంతో వారి జ్ఞాపకాలను మనసులోనే దాచుకుంటాడు. అయితే అతడు చెప్పే ఆ నిజాన్ని ఎవరూ నమ్మకపోవడంతో పాటు అతడికి మానసిక వ్యాధి ఉందని అందరూ భావిస్తారు. కట్ చేస్తే వ్యవసాయ శాస్త్రవేత్త అయిన హీరో తండ్రి కనిపెట్టిన గోల్డెన్ రైస్ కోసం హీరో చెప్పే గతాన్ని నిజం కాదని, అతడు అదంతా ఊహించుకుంటున్నాడు అంటూ విలన్ అందరినీ నమ్మిస్తాడు. అయితే ఆ తరువాత అసలు నిజం తెలుసుకుని ఫైనల్ గా విలన్ ని హతమార్చిన హీరో, ఆపై తన తల్లితండ్రుల గతాన్ని, తాము అప్పట్లో నివసించిన ఇంటిని తెలుసుకుంటాడు.
మొత్తంగా ఎంతో హృద్యంగా సాగె ఈ కథలో చాలావరకు కథనం ప్రేక్షకులను ఆకట్టుకోదు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు అయితే మన తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ కావు అనే చెప్పాలి. ఈ సినిమాలో మహేష్ పెర్ఫార్మన్స్ కు విమర్శకుల నుండి సైతం ప్రశంసలు దక్కాయి. సాంగ్స్, మేకింగ్, భారీ నిర్మాణాత్మక విలువల పరంగా ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికి, టేకింగ్ ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోవడంతో వన్ నేనొక్కడినే సినిమా అప్పట్లో విడుదల తరువాత భారీ ఫ్లాప్ అయింది.... !!