చరణ్ 15.. శంకర్ కు మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్..!
అయితే ఈ సినిమాకు హీరో, డైరక్టర్ రెమ్యునరేషన్ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయని తెలుసుతంది. రాం చరణ్ కు ఎంత ఇస్తున్నారన్నది తెలియదు కాని ఈ సినిమా కోసం శంకర్ కు 60 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నారట. దాదాపు ఈ రేంజ్ లో ఒక ప్రాజెక్ట్ కు రెమ్యునరేషన్ గా తీసుకునే సౌత్ డైరక్టర్ శంకర్ మాత్రమే అని చెప్పొచ్చు. శంకర్ సినిమా హిట్ అయితే కాసుల వర్షం కురవాల్సిందే. అందుకే ఆయన అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేస్తారు. అయితే ప్రస్తుతం శంకర్ ఫాంలో లేడు అయినా సరే రెమ్యునరేషన్ విషయంలో తగ్గట్లేదు.
రాం చరణ్ తో సినిమాకు 60 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. అదే నిజమైతే సౌత్ లోనే కాదు ఇండియాలోనే భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న డైరక్టర్ గా శంకర్ రికార్డ్ సృష్టిస్తారు. శంకర్, చరణ్ కాంబో సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. నేషనల్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కథ కూడా బాగా వచ్చినట్టు తెలుస్తుంది. కచ్చితంగా ఈ క్రేజీ కాంబో సినిమా సంచలనాలు సృష్టిస్తుందని అంటున్నారు. దిల్ రాజు ఇంత రిస్క్ చేస్తున్నాడు అంటే కథలో దమ్ము ఉండే ఉంటుందని అనుకంటున్నారు.