ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయనను పలువురు సినీ రాజకీయ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు సోషల్ మీడియా ద్వారా వైఎస్ఆర్ కు నివాళులు అర్పిస్తున్నారు. వైఎస్ఆర్ తీసుకు వచ్చిన పథకాలను ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సీనియర్ నటుడు మోహన్ బాబు వైఎస్ఆర్ ను స్మరించుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన ట్వీట్ లో మోహన్ బాబు స్నేహ శీలి రాజ టీవీ రాజకీయ దురంధరుడు మాట తప్పడు మడమ తిప్పడు. అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం వైయస్సార్ అంటూ పేర్కొన్నారు.
పేదప్రజల దైవం మా బావ గారు వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు నేడు. అంటూ గుర్తుచేసుకున్నారు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన దీవెనలు తమ కుటుంబానికి ఉండాలని... తెలుగు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నా అంటూ మోహన్ బాబు పేర్కొన్నారు. మరోవైపు టాలీవుడ్ దర్శకుడు కోన వెంకట్ కూడా వైఎస్ జయంతి జయంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. వైఎస్ఆర్ లెజండరీ లీడర్. ప్రజల కోసం ఆయన ఎన్నో పథకాలను సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని ఆయనని ఈరోజు గుర్తుచేసుకుందాం అంటూ పేర్కొన్నారు.
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటున్నా అంటూ పేర్కొన్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని డైనమిక్ లీడర్ వైయస్సార్ గారిని ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వైఎస్ఆర్ జయంతి సంధర్భంగా ఆయన అభిమానులు రాష్ట్రంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. అంతే కాకుండా వైఎస్ఆర్ జయంతి సంధర్భంగా ఆయన కుమార్తె షర్మిల కూడా తెలంగాణలో తన పార్టీని ప్రారంభిస్తున్నారు.