50 ఏళ్ల సీనియ‌ర్ హీరోయిన్‌... ఆ కుర్రాడితో ఎఫైర్ + పెళ్లి... ?

VUYYURU SUBHASH
తెలుగులో ఒక‌ప్పుడు సీనియర్ హీరోయిన్ సితార కు మంచి క్రేజ్ ఉండేది. సితార తెలుగుతో పాటు సౌత్ ఇండియా లో అన్ని భాషల సినిమాల్లోనూ నటించారు. కోలీవుడ్ కు చెందిన విశ్వవిఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ దర్శకత్వం వహించిన సినిమాతో తొలిసారిగా వెండితెరపై నటించిన ఆమె.. దశాబ్దానికి పైగా హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. సినిమాలకు దూరమైన సితార ఆ తర్వాత బుల్లితెర మీద కూడా పలు సీరియల్స్ లో నటించి మెప్పిస్తూ ఉన్నారు.

ఓ నటిగా చెరగని ముద్ర వేసుకున్న ఆమె ఐదు పదుల వయస్సు దాటినా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. సితార కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా... ఓ తెలుగు హీరోతో ప్రేమలో పడిందన్న వార్తలు వచ్చాయి. అప్పట్లో సదరు హీరోను ఆమె పెళ్లి చేసుకుంటుంది అని అందరూ అనుకుంటున్న టైంలో ఆ హీరో మరో అమ్మాయిని పెళ్లాడారు.

ఆ హీరోతో బ్రేక‌ప్ అయ్యాక కొంత కాలం బాధ‌లో ఉన్న ఆమె త‌ర్వాత సీరియ‌ల్స్ తో పాటు స్టార్ హీరోల సినిమాల్లో త‌ల్లి, అక్క పాత్ర‌లు న‌టిస్తూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల తెలుగులో శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను, అరవింద సమేత లాంటి సినిమాలలో నటించి మెప్పించారు. ఇదిలా ఉంటే తాజాగా సితార‌పై రూమ‌ర్స్ వ‌స్తున్నాయి. ఆమె ఓ వ్య‌క్తితో ప్రేమ‌లో ఉంద‌ని... అత‌డినే పెళ్లాడ‌నుంద‌ని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఆ వ్య‌క్తి ఓ పారిశ్రామిక వేత్త అని స‌మాచారం.

సితార క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు అత‌డు ఆమెను అదుకోవ‌డం తో .. వారిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారింద‌ని టాక్ ?  అయితే ఆ వ్యాపార వేత్త‌కు గ‌తంలోనే పెళ్ల‌య్యింది. మ‌రి సితార‌ను అత‌డు ఎలా ?  పెళ్లి చేసుకుంటాడా ? అన్న సందేహం ఉంది. మ‌రో ట్విస్ట్ ఏంటంటే స‌ద‌రు వ్య‌క్తి సితార కంటే వ‌య‌స్సులో చాలా చిన్న వాడ‌ట‌. మ‌రి సితార అత‌డి ప్రేమ‌లో ఎలా ?  ప‌డిందో ?  ఆమెకే తెలియాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: