వైరల్ వీడియో: ఆదాశర్మ టాలెంట్ కి ఫిదా అవ్వాల్సిందే?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఆదా శర్మ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన మొదట్లో తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస అవకాశాలు అందుకుంది. అయితే ఈ అమ్మడికి అదృష్టం మాత్రం అంతగా కలిసిరాలేదు. ఈ అమ్మడు నటించిన సినిమాలు విజయం సాధించినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ మాత్రం సాధించలేకపోయింది ఆదాశర్మ. ఈ క్రమంలోనే క్రమక్రమంగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇక ప్రస్తుతం వెండితెరపై దాదాపు కనుమరుగైపోయింది ఆదాశర్మ.  అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో మెరుస్తోంది.


 అయితే వెండితెరపై  అవకాశాలు తగ్గినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు రచ్చ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఒకప్పుడు హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేసిన ఆదాశర్మ తర్వాత ఎన్నో డిఫరెంట్ వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరినీ అలరించింది. అయితే ముఖ్యంగా ఫిట్నెస్ కు సంబంధించిన కొన్ని వీడియోలను కూడా అప్పుడప్పుడు ఆదాశర్మ పోస్ట్ చేస్తూ ఉంటుంది.  ఇది సాధారణంగా సెలబ్రిటీలు ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే క్షణాల్లో మారిపోతుంటాయి. దీంతో ఆద శర్మ పోస్ట్ చేసిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉండేవి.



 ఇక తాజాగా మరోసారి ఆదాశర్మ తన టాలెంట్ తో అందరినీ అవాక్కయ్యేలా చేసింది.  బీచ్లో చీరకట్టులో కర్ర సాము చేసి అందరిని ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల తమిళనాడులో నిషా అనే యువతి పెళ్లి దుస్తుల్లోనే మార్షల్ ఆర్ట్స్ చేసి అందరినీ షాక్ కి గురి చేసింది. కాగా ఇప్పుడు ఆద శర్మ  కూడా అదే టైప్ లో ట్రై చేసింది. తనకు మార్షల్ ఆర్ట్స్ అంటే ఎంతో ఇష్టమని మహిళలు స్వీయ రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఆదాశర్మ చెప్పుకొచ్చింది. ఇక కర్రసాము తో అందరిని ఫిదా చేసిన ఆదాశర్మ వెంటనే తన దగ్గరికి వచ్చిన కుక్క పిల్లలతో ఎంతో ఆనందంగా ఆడుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: