కళ్యాణ్ రామ్ గురించి మీకు తెలియని విషయాలివే ?

VAMSI
నందమూరి వంశానికి అటు రాజకీయంగా ఇటు సినిమా పరంగా ఎంతో మంచి పేరుంది. ఈ వంశం నుండి వచ్చి నటుడిగా స్థిరపడిన వారిలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. కళ్యాణ్ రామ్ నందమూరి హరికృష్ణ కొడుకు అన్న విషయం తెలిసిందే. నటుడిగా కళ్యాణ్ రామ్ తనకంటూ ఒక మార్కును ఏర్పరుచుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా కళ్యాణ్ రామ్ కూడా నిర్మాతగా మారి కొన్ని సినిమాలను నిర్మించాడు. ఈ రోజు కళ్యాణ్ రామ్ తన 64 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ శుభ సమయాన్ని పురస్కరించుకుని కళ్యాణ్ రామ్ గురించి మనకు తెలియని కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

* కళ్యాణ్ రామ్ హీరోగా కాక ముందు నందమూరి బాలకృష్ణ నటించిన బాలగోపాలుడు చిత్రంలో బాలనటుడిగా నటించి  మెప్పించాడు.  

* ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో హీరోగా మరియు నిర్మాతగా రెండు విభాగాల్లోనూ  తన ప్రతిభను కనబరిచిన మొదటి నటుడు కాయన రామ్ కావడం విశేషం. ఈ విధంగా 7 చిత్రాలకు హీరోగా మరియు నిర్మాతగా వ్యవహరించాడు.

* కళ్యాణ్ రామ్ ఒక్క సినిమాకు రెమ్యూనరేషన్ గా నాలుగు నుండి ఎనిమిది కోట్ల వరకు తీసుకుంటాడు.

* కళ్యాణ్ రామ్ కి ధూమపానం మరియు మద్యపానం అలవాట్లు లేవని తెలుస్తోంది.

* ఇతనికి కుటుంబంతో కలిసి లాంగ్ ట్రిప్ వెళ్లడం అంటే మహా ఇష్టమని తెలుస్తోంది.

*  కళ్యాణ్ రామ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ నే ఇష్టపడతాడు.

* అందరి హీరోలలాగే కళ్యాణ్ రామ్ కి కూడా ఫిట్నెస్ పైన ఆసక్తి ఎక్కువ. ఎక్కువ సమయం తన జిమ్ లోనే గడుపుతూ ఉంటాడు.

తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార మూవీలో నటించనున్నాడు. ఇది ఒక చారిత్రాత్మక చిత్రంగా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి మల్లిడి వశిస్టు డైరెక్టర్ గా వ్యవహరించనున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: