ఆ రెండు విషయాలతో మధన పడుతున్న సమంత !

Seetha Sailaja
‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ సూపర్ సక్సస్ కావడంతో సమంత మంచి జోష్ లో ఉంది. ‘శాకుంతలం’ మూవీ షూటింగ్ కోసం ఎదురు చూస్తున్న సమంతకు ఇప్పుడు రెండు సమస్యలు ఆమెను తెగ బాధ పెడుతూ నిరాశకు లోను చేస్తున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా సమంత తన అభిమానులతో షేర్ చేసుకుంది.


సమంతకు చెన్నైలోని మెరీనా బీచ్ లో నడవడం అంటే చాల ఇష్టం అట. బీచ్ దగ్గర సూర్యోదయం – సూర్యాస్తమయం ఎంజాయ్ చేస్తూ ఆమె సెలెబ్రెటీగా మారిన తరువాత కూడ ఎన్నో సార్లు మెరీనా బీచ్ లో తన మొఖం ఎవరు గుర్తు పట్టకుండా కవరు చేసుకుని అనేకసార్లు నడిచిందట. అయితే తాను అక్కినేని కుటుంబ కోడలుగా మారిన తరువాత చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి సెటిల్ కావడంతో ఆ మెరీనా బీచ్ ని ఆమె మిస్ అయ్యాను అంటోంది.

ఇక సమంత కు చెన్నైలోని టిఫెన్స్ అంటే చాల ఇష్టమట. ప్రస్తుతం భాగ్యనగరంలో తాను అనేక స్టార్ హోటల్స్ లో టిఫెన్ తిన్నా తనకు చెన్నై హోటల్స్ లోని టిఫెన్ టేస్ట్ రావడం లేదు అంటూ ఆమె తెగ బాధపడుతోంది. దీనితో హైదరాబాద్ కు వచ్చాక తనకు ఇష్టమైన ఆ రెండు ఇష్టాలకు దూరమయ్యాను అంటూ ఆమె మధన పడుతోంది.

ఇదే సందర్భంలో ఆమె మరొక ట్విస్ట్ ఇస్తూ కరోనా పరిస్థితులు వల్ల తాను ఇదివరకులా తన పుట్టింటికి వెళ్ళలేకపోతున్నానని తనవారిని చూసుకుని మూడు నెలలు దాటిపోవడంతో తనకు చాల బాధగా ఉందని ఈ కరోనా పరిస్థితులు ఎప్పటికి అదుపులోకి వస్తాయో తనకు తెలియడంలేదని నిరాశలోకి వెళ్ళిపోతోంది. అక్కినేని కుటుంబ కోడలు సమంతకు వందల కోట్లు సంపాదించినా చిన్న విషయాలలో నిరాశే మిగలడం ఆశ్చర్యం. అయితే ఇంత నిరాశలో కూడ సమంత తన వ్యాపార ధోరణికి పదును పెట్టి జ్యూయలరీ బిజినెస్ లోకి దిగడం ఇందులోని ట్విస్ట్..







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: