రామ్ చరణ్ ని కూడా వదలని డేవిడ్ వార్నర్..

Divya
డేవిడ్ వార్నర్..ఇతను ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్ మ్యాన్. ఈయన ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియా లోనే ఉంటున్నారు. ఇటీవల కాలంలో ఈ క్రికెటర్ ఎన్నో వీడియోలను చేస్తూ , తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న  విషయం తెలిసిందే. ఇక అంతే కాకుండా ఇటీవల రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలోని ఒక వీడియో సంచలనం రేపుతోంది. ఆ వీడియో సంగతి ఏంటో చూద్దాం.
డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెటర్, మాజీ కెప్టెన్ కూడా. అంతేకాకుండా ఈ క్రికెటర్ "సన్రైజర్స్ హైదరాబాద్" కెప్టెన్ గా కూడా పని చేశారు. ఇక డేవిడ్ వార్నర్ ఇంతకుముందు కూడా ఎన్నో మార్ఫింగ్ వీడియోలు, టాలీవుడ్ హీరోల సాంగ్స్ మీద చేశారు. అలా చేసిన వీడియోస్ అన్ని తను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ప్రేక్షకులను ఎంతగానో అలరించేవారు.

అయితే దీన్ని బట్టి చూస్తే క్రికెటర్లు కూడా మన టాలీవుడ్ సినిమాలని చూస్తారన్న  విషయం గమనించవచ్చు. ఒక్కోసారి ఈయన ఒక్కడే కాకుండా తన భార్యా పిల్లలతో కూడా డాన్సులు వేస్తూ ఉంటారు. ఇక ఇటీవల తాజాగా రామ్ చరణ్ - బోయపాటి కాంబినేషన్లో వచ్చిన చిత్రం వినయ విధేయ రామ. ఈ చిత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలోని ఒక ఫైటింగ్ సీన్, వార్నర్ ఫేస్ ను మార్ఫింగ్  చేసి, ఒక వీడియో తీసి, డైలాగ్ కూడా చెప్పి వీడియోను విడుదల చేశాడు. దీంతో అటు డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ అభిమానులు కూడా ఎంతో సంబరపడిపోతున్నారు.

ఈ వీడియో చూసిన వారంతా చాలా  హాయిగా నవ్వుకుంటున్నారు. 2021 లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో  చాలా ఘోరంగా విఫలం కావడంతో.. కెన్ విలియమ్స్ కు కెప్టెన్ బాధ్యతలను అప్పగించారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: