రచ్చ బ్యాచ్ తో క్రేజీ ప్రాజెక్ట్ ...
ఒక రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో ఈ వెబ్ సిరీస్ రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కాబోతుందట. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి చర్చలు జరిగాయని, కరోనా ముప్పు తగ్గింది అనే వార్త వినిపించగానే ఈ వెబ్ సిరీస్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు అంటున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ కోసం బిగ్ బాస్ సీజన్ ఫోర్ సెలబ్రిటీస్ పారితోషకం భారీగానే డిమాండ్ చేశారని, వారి వారి క్రేజ్ ను బట్టి రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వినబడుతున్నాయి. ముఖ్యంగా అభిజిత్, మోనాల్ లు భారీ మొత్తంలో అందుకోగా.. ఆ తర్వాత హై రెమ్యూనరేషన్ ముక్కు అవినాష్ కేనని తెలుస్తోంది.
ఇక వీరంతా ఒకే వెబ్ సిరీస్ లో కనిపించబోతున్నారు అంటే అభిమానుల ఆనందానికి అవధులు లేవు. లవ్, కామెడి, ఎమోషన్స్ ఇలా అన్ని ఎమోషన్స్ ని కలగలిపి ప్లాన్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ మంచి రిజల్ట్ ఇస్తుందని ఆశిస్తున్నారట మేకర్స్. మరి ఈ వార్త కరెక్టేనా అంటే పూర్తి వివరాలు అఫీషియల్ గా తెలియాల్సి ఉంది.