అందుకే కదా నువ్వు ' డార్లింగ్ '

VAMSI
2002 లో ఈశ్వర్ చిత్రంతో చాలా సాదాసీదాగా తెరంగ్రేటం చేసిన ప్రభాస్ తన నటనా కౌశల్యంతో వెండి తెరపై ధృవ తారగా ఎదిగారు. బాహుబలిగా ప్రేక్షక బలాన్ని పదింతలు పెంచుకున్నాడు. ఇక అప్పటి నుండి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ అగ్ర కథానాయకుడిగా గొప్ప ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు మన డార్లింగ్. సినిమాలలోనే కాదు సేవాగుణం లోనూ ఎప్పుడూ ముందుంటారు ప్రభాస్. ఓ చిన్నారి చివరి కోరిక తీర్చడానికి కదలి వెళ్లి తన దయా హృదయాన్ని చాటుకున్నారు ప్రభాస్ . ఇటీవలే క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ బాలుడు తనను చూడాలనుకోవడం ఆ పిల్లాడి చివరి కోరిక తెలుసుకున్న ప్రభాస్ వెంటనే హాస్పిటల్ కి వెళ్లి ఆ బాలుడిని కలిసి అతనితో కాస్త సమయాన్ని గడిపాడు.
ప్రతిక్షణం ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలి అంటూ ఆ పిల్లాడికి ధైర్యం చెప్పి ఆ బాలుడిలో ఆత్మస్థైర్యాన్ని నింపాడు. ఏమైనా అవసరం అనిపిస్తే నాకు వెంటనే ఫోన్ చేయండి అంటూ ఆ పిల్లాడి తల్లిదండ్రులకు తెలిపాడు ప్రభాస్. మొదట ఆ పిల్లాడు ఆయువు ఇక రెండు గంటల అని తేల్చి చెప్పారు డాక్టర్లు . అయితే ప్రభాస్ కలిసి వెళ్లిన సంతోషంతో ఆ చిన్నారి బాలుడు రెండు రోజులు ఎక్కువగా జీవించాడన్న వార్త ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసే ఉంటుంది.  ఇలా తనకు వీలైనంత సహాయం అందిస్తూనే ఉంటారు ప్రభాస్. అయితే ఇప్పుడు తన సొంతూరి కోసం ఓ సేవా కార్యక్రమం చేయాలని అనుకుంటున్నట్లు డార్లింగ్ సన్నిహితులు చెబుతున్నారు.
ఈ సేవా కార్యక్రమం ద్వారా ఆ ఊరి ప్రజలకు మెరుగైన వైద్యం అందిచడం,  ఆ ఊరి యువత ప్రతిభకు తగ్గ శిక్షణా కార్యక్రమాలు, ఉపాది వంటి సేవలు అందించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఓ  ప్రముఖ ఎన్ జీ ఓ తో కలిసి ఈ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నారట రెబల్ స్టార్. తన సొంతూరి కోసం తన వైపు నుండి ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేసినట్లు అంటున్నారు. అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: