పవన్ కోసం త్రివిక్రమ్ భారీ త్యాగం..?

Suma Kallamadi
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య మంచి అనుబంధం ఉందన్న విషయం తెలిసిందే. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ వాలంటరీగా హెల్ప్ చేస్తుంటారు. పవన్ సినిమాలకు క్రియేటివ్ ఇన్ పుట్స్ ఇచ్చే త్రివిక్రమ్ ఇప్పుడు ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ తెలుగు రీమేక్ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్, దగ్గుబాటి రానా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ప్రాజెక్టులకు పక్కన పెట్టి ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్ పై దృష్టి సారిస్తున్నారు.
విశ్వసనీయ వర్గాల ప్రకారం.. త్రివిక్రమ్ ఈ సినిమాకి సంబంధించి రాబోయే షూటింగ్ షెడ్యూల్స్ ని చురుకుగా పర్యవేక్షించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ విషయంలో డైరెక్టర్ సాగర్ చంద్ర కు త్రివిక్రమ్ సలహాలు ఇవ్వనన్నారట. అయితే త్రివిక్రమ్ జోక్యం వల్ల సినిమా అవుట్ పుట్ పై నెగిటివ్ ప్రభావం పడే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ వాస్తవాలు మాట్లాడుకుంటే.. సాగర్ చంద్ర కి పవన్ కళ్యాణ్ సినిమాని సోలోగా డైరెక్టర్ చేసేంత అనుభవం లేదు. హై ప్రొఫైల్ సినిమా ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయడం చాలా క్లిష్టతరమైన పని.
అదృష్టవశాత్తూ అతనికి సహాయంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుకు వచ్చారు. దీంతో ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా అనుభవమున్న దర్శకుని పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ సినిమా ని సాగర్ కే. చంద్ర పూర్తి చేయనున్నారు. అలాగే హై ప్రొఫైల్ సినిమాలని ఎలా హ్యాండిల్ చేయాలో ఈ యువ డైరెక్టర్ కి పూర్తి స్థాయిలో అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఇక ఆయన తన సినిమా అవుట్ పుట్ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం ఉండదు. ఇకపోతే తన చిత్రాలకు కేటాయించాల్సిన సమయాన్ని సైతం పవన్ కోసం త్యాగం చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: