ఆ హీరోయిన్‌తో హాట్ అఫైర్.. శృంగార పురుషుడు జగపతిబాబు..?

Suma Kallamadi
టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు అందాల తార సౌందర్య తో అఫైర్ పెట్టుకున్నారని అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే జగపతిబాబు క్లారిటీ ఇచ్చేంత వరకూ ఈ రూమర్స్ అడ్డూ అదుపూ లేకుండా వెల్లువెత్తాయి. అయితే జగపతి బాబు రిలేషన్ షిప్స్ పై మరెన్నో పుకార్లు షికారు చేశాయి. ఆయన శృంగార పురుషుడు అని తనతో పాటు నటించిన కళ్యాణి, విమలారామన్ వంటి హీరోయిన్లతో అఫైర్లు పెట్టుకున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఆయనకు హీరోయిన్ ప్రియమణికి మధ్య హాట్ అఫైర్ ఉందని అప్పట్లో తరచూ వార్తలు వచ్చేవి.

జగపతిబాబు, ప్రియమణి కలిసి పెళ్లయిన కొత్తలో, ప్రవరాఖ్యుడు, సాధ్యం, క్షేత్రం సినిమాల్లో కలిసి నటించారు. పెళ్లయిన కొత్తలో సినిమాలో వీరిద్దరి మధ్య చోటుచేసుకునే రొమాన్స్ ఎంత ఘాటుగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య ఒక రొమాంటిక్ సంబంధం ఏర్పడిందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ప్రవరాఖ్యుడు సినిమా తర్వాత సాధ్యం సినిమా సమయంలో జగపతిబాబు, ప్రియమణిల మధ్య రిలేషన్షిప్ పీక్ స్టేజ్ కి వెళ్లిపోయిందని నివేదికలు పేర్కొన్నాయి. ఇది చాలదన్నట్టు ప్రియమణికి అవార్డు ఇచ్చేందుకు జగపతి బాబు ఫంక్షన్ లో పాల్గొని అగ్నికి ఆజ్యం పోసారు. ఐతే ఈ ఫంక్షన్ల స్టేజి మీద ప్రియమణి జగపతి బాబు తో సరసాలాడటం మరింత అనుమానాలకు దారి తీసింది.

అయితే ఈ పుకార్లు బీభత్సం గా పెరిగిపోవడంతో ప్రియమణి క్లారిటీ ఇచ్చారు. జగపతిబాబుతో తనకు వృత్తి సంబంధమైన రిలేషన్ తప్ప మరేతర సంబంధంలేదని ఆమె కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. ఆయన తో కలిసి నటించినంత మాత్రాన తమ మధ్య రిలేషన్ ఉందని ఎలా చెప్తారని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఇక జగపతి బాబు కూడా తమ మధ్య ఫ్రెండ్షిప్ తప్ప మరే ఇతర సంబంధం లేదని చెప్పుకొచ్చారు. దీనితో ఈ పుకార్లు అవాస్తవమని తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: