అల్లరి నరేష్ గురించి మీకు తెలియని 5 విషయాలు..!

Suma Kallamadi
చిత్రరంగంలో కామెడీ హీరోగా ఎదగడానికి నటనలో చాలా ప్రతిభ కలిగి ఉండాలి. డైలాగ్ డెలివరీ, హావభావాలు, టైమింగ్ కరెక్ట్ గా ఉంటేనే కామెడీ సీన్లు పండుతాయి. కామెడీ హీరోగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన రాజేంద్రప్రసాద్ ఎంత మంచి నటులో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ, రొమాంటిక్, ఎమోషనల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో ఆయన విభిన్నమైన నటనా చాతుర్యాన్ని కనబరిచి ఆశ్చర్యపరిచారు. ఆయన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉత్తమ కామెడీ హీరోగా అల్లరి నరేష్ పేరు తెచ్చుకున్నారు. తన తండ్రి ఇ.వి.వి.సత్యనారాయణ కు తెలియకుండానే "అల్లరి" చిత్రంలో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్న నరేష్ తన మొదటి సినిమా టైటిల్ ని ఇంటి పేరుగా మార్చుకున్నారు. అయితే ఈరోజు టాలెంటెడ్ యాక్టర్ అల్లరి నరేష్ తన 39వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన గురించి ఎవరికీ తెలియని 5 ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

1. చెన్నై లో పుట్టి పెరిగిన అల్లరి నరేష్ తమిళంలో అనర్గళంగా మాట్లాడగలరు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో కూడా ఆయన బాగా మాట్లాడతారు. ఆయన ఫారిన్ ట్రేడ్ లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అతని సోదరుడు ఆర్యన్ రాజేష్ కూడా సినిమా నటుడు కాగా ఆమె తల్లి సరస్వతి కుమారి హోం మేకర్.

2. అల్లరి నరేష్ మే 29, 2015 సంవత్సరంలో చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్ విరూప కంఠమనేని ని పెళ్లి చేసుకున్నారు. సెప్టెంబర్ 28, 2016 సంవత్సరంలో వీరిద్దరికి ఒక పండంటి బిడ్డ పుట్టింది. తమ పాపకి అయానా ఇవిక అని నామకరణం చేశారు. అయితే విరూప అల్లరి నరేష్ నటించిన జేమ్స్ బాండ్ సినిమా తప్ప మిగతా ఏ సినిమా చూడలేదట. ఆమెకు సినిమాలు చూసే సమయం ఉండదని తన పనిలో తను చాలా బిజీగా ఉంటారని అంటుంటారు.


3. అల్లరి నరేష్ ఎన్నో చిత్రాల్లో అద్భుతంగా నటించారు కానీ బెస్ట్ యాక్టర్ గా ఇంతవరకు ఏ అవార్డు తెలుసుకోలేదు. ఐతే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డు గెలుచుకున్నారు. గమ్యం సినిమాలో అత్యుత్తమంగా నటించినందుకు గాను ఆయనకు నంది అవార్డు లభించింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డ్ సౌత్, జీ సినిమా అవార్డు కూడా గెలుచుకున్నారు.


4. ప్రాణం సినిమాలో ద్విపాత్రాభినయం చేసి ఆయన ప్రశంసలు పొందారు. నేను చిత్రంలో ఆయన అద్భుతమైన నటనకు సినిమా విమర్శకులు కూడా మంత్రముగ్ధులయ్యారు. గమ్యం, అహనా పెళ్ళంట, నాంది చిత్రాల్లో కూడా ఆయన తనలోని కొత్తకోణాన్ని పరిచయం చేసి అభిమానులను ఫిదా చేశారు. ఈ చిత్రాల్లో చాలావరకు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి కానీ ఆయన కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయాయి.

5. అల్లరి నరేష్ కి గీతాంజలి సినిమా అంటే చాలా ఇష్టం. అతని ఫేవరెట్ హీరోలు మహేష్ బాబు, నాగార్జున. అతనికి మణిశర్మ సంగీతం అంటే చాలా ఇష్టం. అతని ఫేవరెట్ హీరోయిన్ అనుష్క శెట్టి. అతని ఫేవరేట్ డైరెక్టర్ రవిబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: