హైపర్ ఆది మరీ దిగజారిపోతున్నాడా..?

N.ANJI
తెలుగు బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ చాలా మంది ఆర్టిస్టులను ప్రత్యేక గుర్తింపు అందించింది. ఇందులో హైపర్ ఆది కూడా ఒకరు. ప్రస్తుతం సమాజంలో జరిగే వాటిపై కామెడీ క్రియేట్ చేయగల కెపాసిటి హైపర్ ఆది సొంతం. సాధారణంగా హైపర్ ఆదికి కాంట్రవర్సీల్లో ఇరుక్కుపోవడం కొత్తేం కాదనుకోండి. ఎప్పుడూ వాటి జోలికే వెళ్తుంటాడు. ఈ మధ్యకాలంలో తెలంగాణ గౌరమ్మ, బతుకమ్మలను కించపరిచిన విషయం తెలిసిందే. దీని వల్ల తెలంగాణ జాగృతి సభ్యులు హైపర్ ఆదిపై మండిపడ్డారు. అయితే హైపర్ ఆది కామెడీ టైమింగ్, పంచులతో ప్రేక్షకులు ఎంత నవ్వుకుంటారో.. అప్పుడప్పుడు ఆయన చేసే పనులను చూసి అంతలా కోపగించుకుంటారు. అయితే ఆయన మాత్రం కామెడీ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని చెప్పేస్తాడు.

స్కిట్ల విషయంలో ఎవరైనా ఆరోపించినట్లయితే.. హైపర్ ఆది కేవలం ఒకటే సమాధానం చెబుతారు. నవ్వించడం మా పని.. మీకు నచ్చితే చూడండి.. లేదా స్కిప్ చేసుకోండని చెబుతుంటాడు. సాధారణంగా హైపర్ ఆది స్కిట్లల్లో చూసినట్లయితే కో-కమెడియన్లను తక్కువ చేసి వారిపై పంచులు వేస్తుంటారు. అది ఇప్పటి నుంచే కాదు.. ఎప్పటి నుంచో వస్తోంది. తన తీరును మార్చుకోవాలని చాలా మంది చెప్పినా.. హైపర్ ఆది అక్కడే పరిమితం అయ్యాడు. ఈ విషయం నాగబాబు కూడా చాలా చెప్పుకొచ్చారు. హైపర్ ఆదిలో టాలెంట్ ఉంది కానీ.. పాత పంచులకే పరిమితమయ్యాడని పేర్కొన్నారు. అయినా హైపర్ ఆదిలో ఎలాంటి మార్పు రాలేదు.

తాజాగా పటాస్ ఫేం ఫైమాపై బాడీ షేమింగ్ చేస్తూ పంచులు రాసుకున్నారు. గతంలో అబ్బాయిలకే పరిమితమయ్యే ఈ డైలాగులు ఇప్పుడు అమ్మాయిలపై కూడా విపరీతంగా పంచులు వేస్తున్నాడు. మరీ ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగుల కూడా రాసుకోవడం పరిపాటిగా మారింది. అయితే అమ్మాయిలపై ఇలాంటి వల్గర్ కామెడీ పంచులు వేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఫైమాతో ‘నీ బాడీలో ఒక్కటైనా సరిగ్గా ఉందా.. అన్నీ ఎవరో లోపలికి తోసేసినట్లున్నావ్’ అని చెప్పిన మాటలపై నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అమ్మాయిలను కించపరుస్తూ రాయడం వల్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇప్పటికైనా తన తీరును మార్చుకుని బాడీ షేమింగ్‌పై పంచులు రాయకుండా ఉంటారా లేదా అనేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: