టాలెంటెడ్ యాక్టర్ విద్యాబాలన్ అత్యధిక ప్రాధాన్యమున్న పాత్రల్లో అత్యద్భుతంగా నటిస్తూ భారత దేశ వ్యాప్తంగా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించారు. బేగం జాన్, కహాని, డర్టీ పిక్చర్, మిషన్ మంగల్ చిత్రాలతో ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇటీవల శకుంతలాదేవి సినిమాతో అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు షేర్నీ అనే ఒక థ్రిల్లర్ డ్రామాలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గా నటించి ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ చిత్రం జూలై 18వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలయ్యింది.
అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా విద్యాబాలన్ వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా ఆమె షేర్నీ ప్రమోషనల్ ఈవెంట్ కోసం ఒక ఫ్లోరల్ లెన్త్ డ్రెస్సు ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ డ్రెస్ ని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మృణాలిని రావు డిజైన్ చేశారు. ఐతే చూసేందుకు చాలా సింపుల్ గా ఉన్న ఈ ఉరి బ్రాండ్ డ్రెస్ ధర అక్షరాల 17,900 రూపాయలట. ఈ టైప్ డ్రెస్సులను మృణాలిని రావు వెబ్ సైట్ ను సందర్శించి ఆర్డర్ చేయొచ్చు.
మోచేయి పొడవు స్లీవ్‌లతో ఉన్న ఈ మింట్ గ్రీన్ మాక్సి కాటన్ డ్రెస్ పై చాలా పూల ప్రింట్స్ ఉన్నాయి. తన డ్రస్ కి మ్యాచ్ అయ్యే లాగా విద్యాబాలన్ జ్యువలరీ ధరించారు. బంగారపు చెవి దిద్దులు, నిఖితా జైన్ డిజైన్ చేసిన డ్రాగన్ రింగ్ ధరించి ఆమె చాలా చక్కగా కనిపించారు. అయితే ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇకపోతే ‘న్యూటన్’ ఫేమ్ అమిత్ వి. మసర్కర్ డైరెక్ట్ చేసిన షేర్నీ సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. చాలామంది సినీ విమర్శకులు విద్యాబాలన్ చాలా బాగా నటించారని ప్రశంసించారు. ఒక డిఫరెంట్ కథను తెరకెక్కిన మసర్కర్ కి కూడా ప్రశంసలు దక్కాయి.