తెలుగు సినీ ఇండస్ట్రీలో నాగార్జున అంటే బాగా గుర్తింపు ఉన్న హీరో. ఇక తన కొడుకులు అఖిల్, నాగ చైతన్య ఇద్దరూ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక నాగ చైతన్య , టాలీవుడ్ క్వీన్ సమంతను వివాహం చేసుకున్నారు. ఇక నాగచైతన్య నటించిన సినిమాలలో ఎంతో మంది హీరోయిన్లను నాగచైతన్య అలాగే అతని మేనమామ వెంకటేష్ కూడా చాలా మందిని పరిచయం చేశారు. అయితే ఇప్పుడు నాగచైతన్య ఎంత మందిని పరిచయం చేశాడో తెలుసుకుందాం.
1). సమంత:
గౌతం మీనన్ దర్శకత్వంలో, నాగచైతన్య హీరోగా సమంత హీరోయిన్ గా నటించిన చిత్రం"ఏ మాయ చేసావే". ఈ సినిమా అప్పట్లోనే మంచి హిట్ గా నిలిచింది.
2). అమలాపాల్:
వివేక్ కృష్ణ దర్శకత్వంలో నాగ చైతన్య, అమలాపాల్ కలిసి నటించిన చిత్రం"బెజవాడ".ఈ చిత్రం ద్వారా అమలాపాల్ తెలుగు తెరకు పరిచయం అయ్యింది.
3). పూజా హెగ్డే:
విజయ్ కుమార్ దర్శకత్వంలో,నాగ చైతన్య, పూజా హెగ్డే కలిసి నటించిన చిత్రం"ఒక లైలా కోసం".ఈ సినిమాతో పూజ హెగ్డే తెలుగులో అడుగు పెట్టింది.
4). మడోన్నా సెబాస్టియన్:
ఆల్ ఫోన్స్ విత్ ట్రైన్ దర్శకత్వంలో నాగ చైతన్య, మడోన్నా సెబాస్టియన్ కలిసి నటించిన చిత్రం"ప్రేమమ్". ఇక ఈ చిత్రం ద్వారా మడోన్నా సెబాస్టియన్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది.
5). మంజీమా మోహన్:
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా, మంజీమా మోహన్ హీరోయిన్ గా కలసి నటించిన చిత్రం"సాహసమే శ్వాసగా సాగిపో". ఇక ఈ చిత్రం ద్వారా మంజిమా మోహన్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు.
6). నిధి అగర్వాల్:
చందు మెండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, మాధవన్, నిధి అగర్వాల్, భూమిక కలిసి సంయుక్తంగా నటించిన చిత్రం సవ్యసాచి. ఇక ఈ చిత్రం ద్వారా అందాలతార నిధి అగర్వాల్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు.
7). దివ్యాంశ కౌశిక్:
శివ మోక్ష దర్శకత్వంలో నాగచైతన్య, సమంత అక్కినేని, దివ్యాంశ కౌశిక్ కలసి నటించిన చిత్రం మజిలీ. ఇక ఈ చిత్రం ఒక సెన్సేషనల్ హిట్ ను కొట్టింది. ఇక ఈ చిత్రం ద్వారా దివ్యాంశ కౌశిక్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయింది.