దేవి శ్రీ ప్రసాద్ ఈ బ్రేకప్ సాంగ్స్.. అప్పటికి ఇప్పటికీ ఎవర్ గ్రీన్..!

shami
సినిమాకు మ్యూజిక్ ప్రాణం లాంటిది.. సినిమాలో కథ ఎంత సూపర్ గా ఉన్నా దాన్ని హైలెట్ చేస్తూ ఇచ్చే మ్యూజిక్ కూడా కచ్చితంగా బాగుండాలి. ఈ క్రమంలో కొన్ని సినిమాల్లో మ్యూజిక్ హైలెట్ అవుతూ సినిమాలను డబుల్ హిట్ అయ్యేలా చేస్తాయి. ఇక లవ్ స్టోరీ సినిమాల్లో అయితే కొన్ని సాంగ్స్ యూత్ ఆడియెన్స్ మళ్లీ మళ్లీ వినేలా చేస్తాయి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన సినిమాల్లో లవ్ బ్రేకప్ సాంగ్స్ కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. దేవి మార్క్ మ్యూజిక్ తో అలరించే ఈ పాటలు అప్పుడు ఇప్పుడు ఎవర్ గ్రీన్ గా అనిపిస్తాయి. అలాంటి ఓ పది దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన 10 బ్రేకప్ సాంగ్స్ ఇప్పుడు చూద్దాం.
దేవి మ్యూజిక్ అందించిన మన్మథుడు సినిమా ఆల్బం మొత్తం సూపర్ హిట్. కింగ్ నాగార్జున కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజికల్ హిట్ మూవీ అది. ఆ సినిమాలో చెలియా చెలియా చేజారి వెళ్లకు అనే సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. తన ప్రేయసిని మిస్ అవుతున్నానన్న బాధతో హీరో ఆమెను వెతుక్కుంటూ వెళ్లే ఈ సాంగ్ ఎప్పుడు విన్నా మనసు లాగేస్తుంది.
వర్షం సినిమాలో ప్రతి పాట సూపర్ హిట్టే. అందులో ప్రత్యేకంగా నీటి ముల్లై అని హీరో హీరోయిన్ ను మిస్ అవుతూ తలచుకుంటూ వచ్చే బిట్ సాంగ్ అదిరిపోతుంది. ఇక భద్ర సినిమాలో ఓ మనసా ఓ మనసా సాంగ్ కూడా అప్పట్లో సూపర్ హిట్. ఇప్పటికి ఆ సాంగ్ వింటే మనసు బరువెక్కుతుంది. ఇక దేవి ఆల్ టైం ఫేవరేట్ మ్యూజికల్ హిట్ మూవీ బొమ్మరిల్లు. అందులో అన్ని సాంగ్స్ చాలా స్పెషల్. ఇక ఆ సినిమాలో నమ్మక తప్పని నిజమైనా సాంగ్ ఎవర్గ్రీన్ హిట్. సుశాంత్ హీరోగా వచ్చిన కరెంట్ సినిమాలో అటు నువ్వే ఇటు నువ్వే సాంగ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆ సాంగ్ కూడా ప్రేక్షకులను టచ్ చేసింది.
దేవి మ్యూజిక్ విశ్వరూపం చూపించిన సినిమా ఆర్య 2.. మై లవ్ ఈజ్ గాన్, కరిగే లోగా జీవితం ఈ రెండు సాంగ్స్ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ లోని బదులుతోచని సాంగ్ కూడా ప్రేక్షకులను అలరించింది. కుమారి 21ఎఫ్ సినిమాలో బేబీ యు గోన్నా మిస్ మీ సాంగ్ లవ్ బ్రేకప్ సాంగ్ గా అలరిస్తుంది. ఇక జనతా గ్యారేజ్ సినిమాలో కూడా నీ సెలవడిగి సాంగ్ బ్రేకప్ సాంగ్ ప్రేక్షకుల మనసు బరువెక్కేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: