టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం కథకు ప్రాధాన్యత ఉండే పాత్రలను ఎంచుకునే అతి తక్కువ మంది స్టార్ హీరోయిన్లలో 'సాయి పల్లవి' ముందు వరుసలో ఉంటారు.ఈ హీరోయిన్ కి కథ తో పాటుగా అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలి. అలా లేకపోతే కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చినా సరే దానికి అంగీకరించాదు.అలా తెలుగులో ఫిదా సినిమాతో సంచలన విజయం అందుకున్న ఈ బ్యూటీ కి వరుస పెట్టి అవకాశాలు వచ్చినా.. అందులో కొన్ని సెలెక్టెడ్ కథలను మాత్రమే ఎంచుకొని నటించింది.ఇక ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా వుంది సాయి పల్లవి.
తాజాగా నాగ చైతన్య సరసన లవ్ స్టోరీ, దగ్గుబాటి రానా నటిస్తున్న విరాట పర్వం తో పాటుగా న్యాచురల్ స్టార్ నాని కి జోడిగా శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో నటిస్తోంది.వీటిల్లో లవ్ స్టోరీ, విరాట పర్వం సినిమాలు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల కు సిద్ధంగా ఉన్నాయి. ఇక శ్యామ్ సింగరాయ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాని టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేస్తున్నారు.సినిమాలో నాని సరసన సాయి పల్లవితో పాటూ కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాలో సాయి పల్లవి పోషిస్తున్న పాత్ర ఇదే అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సాయి పల్లవిది హీరోయిన్ పాత్ర కాదని.. ఆమె ఇక విలన్ పాత్రలో కనిపించనుందని అంటున్నారు.ఈ సినిమా కోసం ఎంతో మంది హీరోయిన్లను ఈ విలన్ రోల్ కోసం పరిశీలించగా.. చివరికి సాయి పల్లవి అయితేనే కరెక్ట్ అని భావించి..ఆమెను ఒప్పించినట్లు సమాచారం.అంతేకాదు ఈ సినిమాలో సాయి పల్లవి నెగటివ్ రోల్ లో కనిపించేందుకు కసరత్తులు కూడా చేస్తోందట.ఇక సినిమాకి సంబంధించి ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి కాగా.. త్వరలోనే రెండవ రెండవ షెడ్యూల్ ని ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి...!!