టాలీవుడ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కలిసి చేసిన సినిమాలివే!!

P.Nishanth Kumar
టాలీవుడ్ లో కుటుంబ సభ్యులు కలిసి తీసే సినిమాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఆడవారు సినిమాలలో భాగం పంచుకోవడం టాలీవుడ్ సినిమా పరిశ్రమకే గర్వకారణం. దర్శకురాల్లు గా, నిర్మాతలుగా నటీమణులుగా చాలా విభాగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుతూ టాలీవుడ్ సినీ పరిశ్రమను ముందుకు తీసుకెళ్తున్నారు. స్టార్ హీరోల వారసురాలు కూడా సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక విభాగాన్ని ఎంచుకుని రాణిస్తూతమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలా టాలీవుడ్ లోని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కలిసి చేసిన సినిమాలు ఏంటో ఒక సారి చూద్దాం.

మహేష్ బాబు మంజుల, రామ్ చరణ్ సుస్మిత, నితిన్ నికిత ఈ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కలిసి  ఆల్రెడీ కొన్ని సినిమాలు చేశారు. తాజాగా ప్రభాస్ ప్రసీద , నాని దీప్తి ల కాంబినేషన్ లో కూడా సినిమాలు రాబోతున్నాయి. నటన లో లేదా నిర్మాణంలో బ్రదర్స్ బిజీగా ఉంటే వారికి ఎటువంటి ట్రబుల్స్ లేకుండా సెట్ లో పనులను ఈ సిస్టర్స్ చక్క దిద్దుతున్నారు. నిర్మాతగా నా ని ప్రారంభించిన తాజా సినిమా నీటి క్యూట్ ఈ సినిమాకి దర్శకుడు ఎవరో కాదు ఆయన సోదరి దీప్తి వాల్పోస్టర్ సినిమాను స్థాపించిన నాని నూతన దర్శకులకు అవకాశం ఇస్తూ వచ్చారు అలా దీప్తి ఆయన అవకాశం ఇచ్చారు డైరెక్షన్ తో పాటు బాధ్యతలు కూడా ఆమె మోయాల్సి ఉంటుంది.

ప్రభాస్ తన సోదరి ప్రసీదా ను నిర్మాతగా పరిచయం చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా నిర్మాతలలో ప్రసీద ఒకరు. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు పెద్ద కుమార్తె ప్రసీద. తండ్రి ,అన్నయ్య వారసత్వంతో ఆమె పరిశ్రమ లోకి రాలేదు. అమెరికా వెళ్లి ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశారు. అక్కడ పనిచేశారు. ఇండియాకు వచ్చిన తర్వాత సొంత నిర్మాణ సంస్థ గోపికృష్ణ మూవీస్ లో బాధ్యతలు పంచుకున్నారు.  జాతి రత్నాలు సినిమా ప్రచారంలో ఆమెది ముఖ్య భూమిక. ఇక రామ్ చరణ్ హీరో గా, నిర్మాతగా వ్యవహరిస్తుండగా చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా చాలా సినిమాలకు పనిచేశారు. ఇప్పుడు నిర్మాణ సంస్థను కూడా పెట్టి  దాని ద్వారా పలు వెబ్ సిరీస్ ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వారసులుగా చిత్రసీమకు వచ్చి సత్తా చాటుతున్న మహిళల శాతం రోజు రోజుకి ఎక్కువైపోతుంది అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: