ఫిట్‌నెట్ సూత్రాలు చెప్తున్న అల్లు శిరీష్‌..

Suma Kallamadi
బ‌న్నీ త‌మ్ముడిగా మెగా హీరోగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు వారి యంగ్ హీరో శిరీష్. ఇక ఇప్పుడు తన కొత్త మూవీ కోసం గట్టిగా చేంజ్ అయిన అల్లు శిరీష్ ఆ వర్కవుట్స్ ను ఎలా చేయాలో చెబుతున్నాడు. ఫిట్‌గా ఎలా ఉండాలి అనే విషయంపై ఇప్పుడు అంద‌రికీ ఈ యంగ్ హీరో తన వీడియోల ద్వారా మెసేజ్ ఇస్తున్నాడు. దాంతో పాటే తన వర్కవుట్స్ ఎలా కొన‌సాగుతున్నాయో ఇక తాను ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం చేసిన ప్రయత్నంలోని విష‌యాల గురించి ఓ వీడియోను విడుదల చేశాడు ఈ యంగ్ హీరో.

ఇక ట్రైనింగ్ డే పేరుతో సోషల్ మీడియాలో అల్లు వారబ్బాయి శిరీష్ ఫిట్ నెస్ కు సంబంధించిన ఓ వీడియోను అప్‌లోడ్ చేయ‌గా.. ప్ర‌స్తుతం దీనికి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మొద‌టి వీడియోలో బ్యాక్ వర్కవుట్స్ గురించి చూపించిన శిరీష్‌.. ఆ త‌ర్వాత జిమ్‌లో ఈ హీరో ఎంత కష్టపడ్డాడ‌నేది ఈ వీడియోలో మనకు కళ్లకు కట్టినట్లు చూపించాడు.

అలాగే ఈ వీడియోలో ముందుగా తాను వామప్ చేసిన తర్వాత ఒక్క చేతితో డంబెల్స్ ను లిఫ్ట్ చేయడం మెస్మ‌రైజ్ చేస్తోంది. ఇక 30 సెకన్ల పాటు వీడియోలో జిమ్‌కు సంబంధించిన చాలా రకాల అంశాల‌ను చూపించాడు శిరీష్‌. అలాగే తన వర్కవుట్ షెడ్యూల్‌లో ఏమేం ఫిట్ నెస్ సూత్రాలు ఉన్నాయో ఈ డిజిటల్ సిరీస్‌లో చూపించే ప్ర‌య‌త్నం చేశాడు ఆయ‌న‌.

అయితే వీడియోలో కేవలం జిమ్ ట్రైనింగ్, ఫిట్‌నెస్ తో పాటుగా యోగా, బాక్సింగ్‌కు సంబంధించిన చాలా ర‌కాఅ అంశాల‌ను కూడా ఇందులో చూపించబోతున్నాడు ఈ హీరో. ఆయ‌న స్వ‌యంగా గోల్స్ సెట్ చేసుకుని మ‌రీ ఫిట్‌నెస్ పరంగా వాటిని చేరుకుంటున్నారు అల్లు శిరీష్. ఇప్పుడు కూడా తన ఫాలోయర్స్ కోసం కొన్ని వీడియోలు పెట్టిన ఈయ‌న ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇచ్చేందుకు రెడీ అవుతునున్నారు అల్లు శిరీష్.


Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: