జయసుధ.. ఆంటీ పాత్రలకు చిరునామా..!

Suma Kallamadi
మహానటి సావిత్రి తర్వాత సహజ నటిగా పేరు తెచ్చుకున్న జయసుధ లక్ష్మణ రేఖ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు. అడవి రాముడు సినిమా తో ఆమె అగ్రతారగా ఎదిగారు. ఆమె హీరోయిన్ గా మాత్రమే కాదు విభిన్న పాత్రలలో అద్భుతమైన నటన ప్రదర్శన చూపించి వావ్ అనిపించారు. ఆమె 300కు పైగా చిత్రాల్లో నటించారు. ఒకే సంవత్సరంలో 24 సినిమాలకు పైగా నటించి చెక్కుచెదరని రికార్డు సృష్టించారు. అయితే వయసు పైబడిన తర్వాత ఆమె ఆంటీ పాత్రల్లో చాలా సహజంగా నటించి ఆంటీ పాత్రలకు చిరునామాగా మారారు.

బొమ్మరిల్లు చిత్రంలో ఆమె పర్ఫామెన్స్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ ని ప్రతిఘటించే సన్నివేశంలో జయసుధ తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. ఈ చిత్రం మొత్తం లో ఆమెకు డైలాగులు తక్కువగానే ఉన్నాయి కానీ క్లైమాక్స్ లో ఆమె పాత్ర చాలా కీలకంగా మారుతుంది. అయితే ఇటువంటి కీలక పాత్రలో ఆమె అవలీలగా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఇదొక్క సినిమాలో మాత్రమే కాదు ఆమె చాలా సినిమాల్లో ఆంటీ గా కనిపించి అబ్బురపరిచారు. ఆమె నటన, డైలాగ్ డెలివరీ, వస్త్రధారణ అన్నీ కూడా మన ఇంటి పక్క ఆంటీని గుర్తుచేస్తాయి అంటే అతిశయోక్తి కాదు.

రవితేజ హీరోగా నటించిన చాలా సినిమాల్లో జయసుధ ఆంటీ పాత్రల్లో నటించారు. దరువు, సారొచ్చారు, దరువు చిత్రాల్లో ఆమె తన పాత్రలలో చక్కగా ఒదిగిపోయారు. దరువు చిత్రంలో హీరోగా నటించిన రవితేజ కి తల్లి పాత్రలో జయసుధ నటించిన మెప్పించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో ఆమె వెంకటేష్, మహేష్ బాబు లకు తల్లిగా నటించారు. శతమానం భవతి సినిమా లో జానకమ్మ పాత్రలో ఆమె ఒదిగిపోయారనే చెప్పాలి. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంలో కూడా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: