
టాలీవుడ్ లో పరాయుల ఆక్రమణ !
ఆతరువాత వచ్చిన కృష్ణ శోభన్ బాబు కృష్ణంరాజు లతో పాటు ప్రస్తుత మెగా స్టార్ చిరంజీవి సినిమాలు కూడ తమిళనాడులో అంతంత మాత్రంగానే సక్సస్ అయ్యాయి. అయితే ‘బాహుబలి’ తో ట్రెండ్ మారి ప్రభాస్ తమిళ ప్రేక్షకులలో కూడ ఇమేజ్ తెచ్చుకావడంతో ఇప్పుడు మన టాప్ హీరోలు అంతా పర భాషా సినిమా రంగంలో తమ మార్కెట్ ను పెంచుకోవడానికి చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈప్రయత్నాల ఫలితం ఇంకా తేలకుండానే ప్రముఖ తెలుగు నిర్మాతలు దర్శకులు వరస పెట్టి టాప్ తమిళ హీరోలతో డైరెక్ట్ గా తెలుగులో తీస్తున్న సినిమాల సంఖ్య పెరుగుతూ ఉండటంతో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ పై పరాయి ఆక్రమణ నెమ్మదిగా పెరుగుతోందా అన్నసందేహాలు కలుగుతున్నాయి. శేఖర్ కమ్ముల ధనుష్ ల కాంబినేషన్ లో మూవీ ప్రకటనతో పాటు వంశీ పైడిపల్లి విజయ్ ల కాంబినేషన్ లో పూరీ జగన్నాథ్ సూర్య కాంబినేషన్ లో ఇలా చాల క్రేజీ కాంబినేషన్స్ లో తెలుగులో డైరెక్ట్ తెలుగు సినిమాలు రాబోతున్నాయి.
ఇది చాలదు అన్నట్లుగా మళయాళ క్రేజీ స్టార్ దుల్కర్ సల్మాన్ తో ఒక డైరెక్ట్ తెలుగు మూవీ త్వరలో రాబోతోంది. అనేకమంది తమిళ దర్శకుల హవా ఇప్పటికే కొనసాగుతోంది. దీనితో ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి ఎవరు కారణం అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి. మన టాప్ హీరోలు మితిమీరిన ఆత్మ విశ్వాసంతో తమ చుట్టూ అనేకమంది దర్శకులను సినిమాల ఎంపిక విషయంలో ఒక ఆట ఆడిస్తున్న పరిస్థితులలో ఈ ఆటను భరించలేక చాలామంది టాలెంటేడ్ తెలుగు దర్శకులు కోలీవుడ్ హీరోలతో సినిమాలు తీస్తున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాలలోని కొందరు కామెంట్స్ చేస్తున్నారు..