రాజ రాజ చోర టీజర్ రివ్యూ.. శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ పక్కా..!
నూతన దర్శకుడే అయినా టీజర్ విషయంలో మాత్రం తన ప్రతిభ చూపించాడు. సినిమాలో కూడా కంటెంట్ కన్నా స్క్రీన్ ప్లే మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు ఉన్నారు. ఇక సినిమా టీజర్ లో ముఖ్యంగా వివేక్ సాగర్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. ఆల్రెడీ ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు తన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవల్ తీసుకెళ్లే వివేక్ సాగర్ రాజ రాజ చోరకి కూడా అదే తరహా మ్యూజిక్ ఇచ్చాడని తెలుస్తుంది. నిమిషం టీజర్ లో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టైటిల్ సాంగ్ బాగుంది.
ఇక సినిమాలో హీరోయిన్ గా నటించిన మేఘా ఆకాష్ లుక్స్ వైజ్ ఆకట్టుకుంది. శ్రీవిష్ణు, మేఘా ఆకాష్ ల జోడీ బాగుంది. ఇక సినిమాలో సునైనా కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది. బ్రోచేవారెవరురా సినిమాతో హిట్ అందుకున్న శ్రీ విష్ణు ఈమధ్యనే వచ్చిన గాలి సంపత్ తో గురి తప్పినా మళ్ళీ రాజ రాజ చోర సినిమాతో పక్కా హిట్టు కొట్టేలా ఉన్నాడు. టీజర్ ఇంప్రెసివ్ గా అనిపించగా సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందో లేదో చూడాలి.