డార్లింగ్
ప్రభాస్ తో వర్షం
సినిమా తీసి బంపర్ హిట్ కొట్టిన
డైరెక్టర్ శోభన్ కుమారుడు
సంతోష్ శోభన్. బాలనటుడిగా
సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన
సంతోష్ గోల్కొండ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత
సంతోష్ శోభన్ "తను నేను" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ పెద్దగా ఉపయోగం లేకపోయింది. మళ్ళీ "పేపర్ బాయ్" చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినా అది కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆ తరువాత కాస్త గ్యాప్ తీసుకుని ఈ సారి సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
యువ దర్శకుడు
మేర్లపాక గాంధీ ఈ సినిమాకు కథను అందించగా,
కార్తీక్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. "ఏక్
మినీ కథ" పేరుతో విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కింది. కానీ థియేటర్లు మూతబబడడంతో ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్
అమెజాన్ ప్రైమ్ లో విడుదలయింది.
కాన్సెప్ట్ బాగుండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాకు మంచి ఆదరణే లభించింది. ఈ
సినిమా సక్సెస్ ఫుల్ గా స్ట్రీమ్ అవుతూనే ఉంది. ఈ
సినిమా కోసం
ప్రభాస్ కూడా ప్రమోషన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ
సినిమా కారణంగా ఇప్పుడు వరుసగా అవకాశాలను అందుకుంటున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, అందులో ఫ్యామిలీ
డైరెక్టర్ మారుతీతో ఒక
సినిమా ఉండడం విశేషం. ప్రస్తుతం
సంతోష్ ఇంకొక ప్రాజెక్టును లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అది కూడా
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మాణంలో అని తెలుస్తోంది. అది కూడా
తమిళ్ రీమేక్ మూవీ "8 తొట్టకల్" అట.
గతంలోనే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు
రీమేక్ హక్కుల్ని సుస్మిత దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ
రీమేక్ సినిమాలో
సంతోష్ శోభన్ ను హీరోగా అడుగగా ఒకే అయినట్లు సమాచారం. ఈ సినిమాను కూడా
తమిళ డైరెక్టర్ శ్రీ గణేష్ తెరకెక్కించనున్నట్లు టాక్. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పేలా లేదు. ఈ
సినిమా అయినా
సంతోష్ కు స్టార్ డమ్ తెచ్చి పెడుతుందా చూడాలి.