జర్నలిస్ట్ తలచుకుంటే నడిరోడ్డు మీద పొలిటీషియన్.. కెమెరా మెన్ గంగతో రాంబాబు అదరగొట్టాడు..!
అయితే బయట ఇది సాధ్యం అవుతుందా కాదా అన్నది పక్కన పెడితే సినిమాలో తమ హీరో తమ భావాలకు దగ్గరగా పోరాటం చేస్తుంటే ఆడియెన్స్ ఫీల్ అయ్యే కిక్ వేరేలా ఉంటుంది. కెమెరా మెన్ గంగతో రాంబాబు సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ మార్క్ డైలాగ్స్ తో పాటుగా యాక్షన్, కామెడీ కూడా మిక్స్ చేశాడు పూరీ. అందుకే సినిమా ఆశించిన స్థాయిలో ఫలితన్ని అందుకోలేదు. కాని పవన్ కెరియర్ లో బెస్ట్ పొలిటికల్ డ్రామాగా కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా అని చెప్పుకోవచ్చు.
ఈమధ్య వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వకీల్ గా ఉంటూ ముగ్గురు అమాయకమైన అమ్మాయిలకు అండగా నిలబడతాడు. రాజకీయ శక్తులు ఆ అమ్మాయిలకు అన్యాయం చేయాలని చూసినా లాయర్ గా తన డ్యూటీని పర్ఫెక్ట్ గా చేసి వారిని కేసు గెలిపిస్తాడు వకీల్ సాబ్. పవన్ ప్రతి సినిమాకు పొలిటికల్ టచ్ ఉండాల్సిందే. ఇప్పుడు తను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండటం వల్ల పొలిటికల్ స్పీచ్ లు.. డైలాగులు పవన్ సినిమాల్లో కామన్ అయ్యాయి.