అలీ, పవన్ మధ్య గొడవకి కారణం అదేనా..?
ఇక 2019 ఎన్నికల సమయంలో మాత్రం పవన్ కళ్యాణ్ అలీ మధ్య విభేదాలు తలెత్తాయి. అందుకు కారణం ఏంటంటే.. అలీ జనసేన పార్టీలో చేరతారని ఆయన అభిమానులు భావించారు. అలీ వారి ఆశలను నిరాశలు చేస్తూ వైసీపీలో చేరి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ఆ తరువాత పవన్ కు, అలీకి మధ్య గొడవలు వచ్చాయని వార్తలు అప్పట్లో బాగా ప్రచారంలోకి వచ్చాయి.
ఇక తాజాగా అలీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈసందర్భాంగా ఆయన పవన్ కళ్యాణ్ తో గొడవ గురించి స్పందించి స్పష్టత ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ తో ఆ టైమ్ అలా జరిగిపోయిందని ఆయన మనస్సులో నుంచి ఆ మాట రాకపోయినా ఎవరో చెబితేనే ఆయన చెప్పారు తప్ప ఆయన అలా అనే వ్యక్తి కాదని అలీ చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ తన గురించి అన్న మాటల విషయంలో తాను ఫీల్ కానని ఆయన అన్నారు. అంతేకాదు.. స్నేహితులు అంటే ఒక మాట తను అనడం ఒక మాట నేను అనడం జరుగుతుందని అలీ చెప్పుకొచ్చారు.
అయితే గొడవలు వచ్చినా మళ్లీ కలుసుకుంటామని పవన్ కళ్యాణ్ కు తనకు మధ్య ఉన్న శత్రుత్వం శాశ్వత శత్రుత్వం కాదని అలీ ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు. ఇక తను రాజకీయాలలో జాయిన్ అయిన రోజే రాజకీయాలు వేరు, సినిమాలు వేరు, ఫ్రెండ్ షిప్ వేరు అని చెప్పానని అలీ తెలియజేశారు. అంతేకాదు.. పవన్ తాను రాజకీయాలపరంగా వేరు అయినా అంతకు మించి తమ మధ్య ఏ సమస్యలు లేవని అలీ తెలియజేశారు.