నటసింహం నందమూరి
బాలకృష్ణ హీరోగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన
మాస్ యక్షన్
సినిమా లక్ష్మి నరసింహా. 2004 సంక్రాంతికి మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ
మూవీ సూపర్ హిట్ కొట్టింది.
శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అగ్ర
నిర్మాత బెల్లంకొండ
సురేష్ ఎంతో భారీగా నిర్మించిన ఈ సినిమాలో పవర్ఫుల్
పోలీస్ అధికారి లక్ష్మి నరసింహా పాత్రలో
బాలయ్య టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ కి ప్రేక్షకాభిమానుల నుండి మంచి పేరు దక్కింది. అప్పట్లో ఈ
సినిమా చాలా ఏరియాల్లో పలు రికార్డులను నెలకొల్పింది.
ఇక ముఖ్యంగా ఈ సినిమాలో
బాలయ్య పలికే పవర్ఫుల్ డైలాగ్స్ కి థియేటర్స్ లో ఫ్యాన్స్ విపరీతంగా ఈలలతో హోరెత్తించారు.
మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో
ఆసిన్ కథానాయికగా నటించగా
ప్రకాష్ రాజ్ విలన్ పాత్ర చేసారు. అంతకముందు
తమిళ్ లో
విక్రమ్ హీరోగా తెరకెక్కిన సామి సినిమాకి
రీమేక్ గా తెరకెక్కింది ఈ మూవీ. కథ పరంగా చూస్తే తన తండ్రిని, అలానే కొందరు ఊరి ప్రజలను హతమార్చిన ధర్మభిక్షం అనే రౌడీ ని అంతమొందించడానికి అతడి నివాస ప్రాంతమైన విజయవాడకు విచ్చేసిన
పోలీస్ అధికారి లక్ష్మినరసింహా, ఏ విధంగా తన తెలివితేటలు, సాహసంతో అతడిని మట్టుబెట్టాడు అనేది ఓవరాల్ కథ.
ఇక ఈ సినిమాని
బాలయ్య ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల
ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు జయంత్ ఎంతో అద్భుతంగా తీశారు. అయితే ఈ
సినిమా విడుదల తరువాత
నిర్మాత బెల్లంకొండ
సురేష్ పై
హీరో బాలకృష్ణ కాల్పులు జరిపిన కేసు అప్పట్లో సంచలనంగా మారింది. మొత్తంగా
బాలకృష్ణ పోలీస్ అధికారిగా నటించిన ఈ లక్ష్మినరసింహా
మూవీ ఆయన కెరీర్ లోని బెస్ట్ కాప్ సినిమాల్లో ఒకటి అని చెప్పకతప్పదు ..... !!