టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర హీరోల సరసన నటించి హీరోయిన్ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రియమణి కూడా ఒకరు.తెలుగుతో పాటుగా తమిళంలో కూడా పలు సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ.. ఆ తర్వాత ఉన్నట్టుండి పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఇక పెళ్ళి తర్వాత మళ్ళీ వరుస ఆఫర్లతో బిజీగా మారింది ఈ హీరోయిన్.కేవలం సినిమాలే కాదు.. వెబ్ సీరీస్ లతో పాటూ బుల్లితెరపై పలు షోలకు జడ్జి గా కూడా వ్యవహరిస్తోంది.ఇక తాజాగా ఈమె నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్2' అనే వెబ్ సీరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సీరీస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
అయితే సీజన్1 లో అరవింద్, సుచిత్ర పాత్రల మధ్య లోవానాలో ఏం జరిగిందనే విషయాన్ని మాత్రం చెప్పానని..అది టాప్ సీక్రెట్ అని తెలిపింది.ఇక ప్రస్తుతం తన కెరీర్ గురించి మాట్లాడుతూ..వెంకటేష్ సరసన 'నారప్ప' అలాగే 'విరాట పర్వం' సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నానని చెప్పిన ఈ భామ.. ఆ రెండు సినిమాలు తన రోల్స్ చాలా స్పెషల్ గా ఉంటాయని పేర్కొంది.ఇదిలా వుండగా తన వ్యక్తిగత జీవితం గురించి ప్రియమణి చేసిన పలు వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గామారుతున్నాయి.తన భర్త తనకు ఎంతో సపోర్ట్ గా ఉంటాడని..పెళ్లి తర్వాత ఆయన ఇచ్చిన సపోర్ట్ తోనే ఇప్పుడు సినిమాలు చేయగలుగుతున్నానని తెలిపింది.
అంతేకాదు పెళ్లి తర్వాత తనకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని.. ఇకఅప్పుడప్పుడు తమ మధ్యవస్తుంటాయని.. ఆ సమయంలో మాత్రం తన భర్త తగ్గుతుంటారని చెప్పింది ప్రియమణి.ఇక ప్రస్తుతం ఇండ్రస్టీ లో ఉన్న దర్శకనిర్మాతల మైండ్ సెట్ చాలా మారిందని..పెళ్ళయిన హీరోయిన్లకు కూడా ఇప్పుడు మంచి అవకాశాలు ఇస్తున్నారని..పెళ్లి తర్వాత కూడా కాజల్,సమంత లాంటి హీరోయిన్లు ఇప్పటికీ స్టార్స్ గా కొనసాగుతున్నారని అన్నారు.అంతేకాదు పెళ్ళైన హీరోయిన్స్ కి సంబంధించిన లుక్స్ పై కొందరు కామెంట్స్ చేస్తుంటారని..కానీ తనపై మాత్రం ఇప్పటి వరకు బాడీ షేమింగ్ కామెంట్స్అయితే రాలేదని చెప్పుకొచ్చింది ప్రియమణి...!!