
ఆమెతో విడిపోవడానికి కారణం శిల్పా కాదు అంటున్న రాజ్‌కుంద్రా..?
ఇక ఇదే విషయంలో కవితపై విడిపోవడానికి సంచలన కారణాలు చెప్పారు కుంద్రా. ఆయన అందుకు గల కారణాలను వెల్లడించారు. కవితకు తన చెల్లి భర్త అయిన తన బావకు మధ్య వివాహేతర సంబంధం ఉందని సంచలన ఆరోపణలు చేశాడు రాజ్‌కుంద్రా. ఇక ఆయన చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారాయి. బీటౌన్‌లో అంతా ఇప్పుడు వీరి విడాకుల గురించే చర్చించుకుంటున్నారు.
రాజ్‌కుంద్రా తన మొదటి భార్య కవితతో కలిసి కొన్ని సంవత్సరాల క్రితం లండన్‌లో ఉన్నానని చెప్పాడు. అయితే ఆ టైమ్‌లో తన ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు తన చెల్లెలు, ఆమె భర్త కూడా తమతోపాటే ఒకే ఇంట్లో ఉండేవాల్లమన్నాడు. అప్పుడే వారి సంబంధం ఏర్పడిందన్నాడు. తన చెల్లి, ఆమె భర్త ఉండేందుక తానే ఒప్పించినట్టు వివరించారు.
అయతే రాజ్‌కుంద్రా తన బిజినెస్ వ్యవహారాలపై బయట టూర్‌కి వెళ్తే కవిత ప్రవర్తనలో చాలా రకాల మార్పులు వచ్చేవని తెలిపారు. తాను లేనప్పుడు కవిత తన చెల్లెలి భర్తతో ఎఫైర్ పెట్టుకునేదన్నారు వారి గురించి ఇంట్లో వారంతా చెప్పినా తాను నమ్మలేదన్నారు. చివరకు తన కారు డ్రైవర్ కూడా వారిపై ఆరోపనలు చేయడం, అసభ్యంగా మాట్లాడటంతో అసలు విషయం తెలిసిందన్నారు. ఆ విషయం తెలిసి తన గుండె ముక్కలయిందని చెప్పారు. దీంతో కవితకు విడాకులు ఇచ్చానని వెల్లడించారు రాజ్‌కుంద్రా.