మీ ఆయన కూడా అదే చేస్తాడు.. అనసూయ భర్తపై కామెంట్ చేసిన రోజా?

praveen
జబర్దస్త్ షో ప్రస్తుతం నవ్వుకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. సినిమాలో వచ్చే ఎంటర్టైన్మెంట్ కంటే ఎక్కువగా ప్రస్తుతం ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. జబర్దస్త్ కార్యక్రమం ఎన్నో ఏళ్ల నుంచి టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ బుల్లితెర చరిత్రలోనే ఒక అద్భుతమైన కామెడీ షో గా పేరు సంపాదించుకుంది. అయితే జబర్దస్త్ కార్యక్రమం ప్రతి వారం కూడా సరికొత్త ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటుంది. కమెడియన్స్ అందరూ ఎప్పటికప్పుడు సరికొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.



 కొన్ని కొన్ని సార్లు జబర్దస్త్ లోని కమెడియన్స్ తీసుకునే కాన్సెప్టులు పాతవే అయినప్పటికీ వాటిని కొత్తగా ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తూ ఉంటారూ.  అదే సమయంలో అటు జబర్దస్త్ ఎపిసోడ్ ఎంతగానో ఆసక్తిని పెంచేందుకు మొత్తం ఎపిసోడ్ లోని కీలక పంచులు మొత్తం ఇక ప్రోమోలో చూపిస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవల విడుదలైన జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఇక ఈ ప్రోమో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.  ఇక ఎప్పుడూ సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే రాకెట్ రాఘవ ఇక ఈ సారి పెళ్ళాం ఊరెళితే అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.



 అయితే పెళ్ళాం ఊరెళితే అనే కాన్సెప్ట్ పాతదే అయినప్పటికీ ఎప్పుడు ప్రేక్షకులకు మాత్రం కొత్తగా అని అనిపిస్తూ ఉంటుంది.  భర్తతో కలిసి ఉండే భార్య పుట్టింటికి వెళ్ళింది అంటే భర్త ఇంట్లో స్నేహితులతో ఎంతగా ఎంజాయ్ చేస్తాడు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఇదే కాన్సెప్ట్ ని తీసుకున్నాడు రాకెట్ రాఘవ. ఈ క్రమంలోనే రాకెట్ రాఘవ స్కిట్ చేస్తున్న సమయంలో అనసూయ భర్త పై రోజా చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి. పెళ్ళాం ఊరెళితే వారం రోజులు ఇంట్లో పండుగ అంటూ రాకెట్ రాఘవ అనగానే ఈ స్కిట్ మా ఆయన చూడకుండా చేయాలి అంటుంది అనసూయ.. ఇక వెంటనే అందుకున్న రోజా నువ్వు షూటింగ్ కి వచ్చినప్పుడు మీ ఆయన కూడా అదే చేస్తుంటాడు అంటూ కామెంట్ చేయడం తో ఇక నోరెళ్ళ పెడుతుంది అనసూయ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: