హీరో, హీరోయిన్ ల మధ్య అక్కడ కూడా ప్రేమ పుడుతుందా అనిపించేలా..!!
మణిరత్నం దర్శకత్వం, ఇళయరాజా సంగీతం, రాజశ్రీ సంభాషణలు, పిసి శ్రీరామ్ ఛాయాగ్రహణం వెరసి ఈ సినిమా సూపర్ హిట్ అవడానికి దోహదపడ్డాయి. హీరోయిన్ గా శరణ్య, కీలక పాత్రలో నాజర్ నటించిన ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పొచ్చు. ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వస్తే ఒక్క సీన్ కూడా వదిలిపెట్టకుండా చూస్తారు. అండర్ వరల్డ్ డాన్ వరదరాజన్ మొదలియార్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా కథ బాగా నచ్చడంతో వెంటనే సినిమా ను మొదలు పెట్టాడట కమల్ హాసన్.
ఇక ఈ సినిమాలో మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది హీరోయిన్ పాత్ర చేసినా శరణ్య గురించి. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు కలుసుకునే తొలి సీన్ ను దర్శకుడు ఎంత బాగా డిజైన్ చేశారో. వేశ్యగా ఉన్న హీరోయిన్ దగ్గరికి హీరో విటుడి గా వెళ్లి ఆమె బాధను చదువు పట్ల ఉన్న ఆసక్తి తెలుసుకుని పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు.అలా వారిద్దరి మధ్య అయిన పరిచయం ప్రేమగా, ఆ తర్వాత పెళ్లి గా మారుతుంది. నటి శరణ్య కెరియర్ లోనే ఇది బెస్ట్ చిత్రంగా ఆమె చాలాసార్లు నాయకుడు సినిమా అని చెప్పగా ఈ పాత్ర పోషించి ఆమె మంచి పని చేసింది అని ప్రేక్షకులు ఇప్పటికీ అంటున్నారు.