రంగురంగుల రంగస్థలాలు.. మూగబోతున్నాయి?

praveen
ప్రస్తుతం అయితే సినిమాల ద్వారా ఎంతగానో ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు ప్రేక్షకులు. కానీ ఒకప్పుడు చిత్రపరిశ్రమ లేని సమయంలో సురభి నాటక బృందాలు ఎప్పుడు ప్రజలందరినీ అలరిస్తూ ఉండేవి. ఇక తమ నటనతో ఎంతో మందిని మెప్పిస్తూ ఉండే వారు. ఇలా సురభి నాటక కళను ప్రదర్శిస్తూ ఉపాధి పొందే వారు ఎంతోమంది.  అయితే ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో రాణించిన వారు సైతం ఇలా నాటకాల నుంచి వచ్చిన వారే కావడం కూడా గమనార్హం. ఇలా ఎన్నో ఏళ్ల నుంచి తమ నాటక ప్రదర్శనలో తెలుగువారిని మెప్పించిన సురభి నాటక బృందాలు ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి.



 ఎప్పుడు ప్రజల ఆదరణతో కోలాహలంగా సాగిపోయే ఈ నాటక బృందాలు ప్రదర్శనలు ప్రస్తుతం మూగబోతున్నాయి.  136 ఏళ్ల చరిత్ర ఉన్న సురభి నాటక బృందాలు ప్రస్తుతం అతలాకుతలం అవుతున్నాయి.  కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం సురభి నాటక బృందాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది.  ప్రస్తుతం రోజు రోజుకి  సినిమాలకు ఆదరణ పెరిగిపోతు ఉండటం.. అదే సమయంలో సురభి నాటక బృందాల ప్రదర్శనను తిలకించేందుకు అంతగా ఆసక్తి చూపకపోవడంతో ఇక వారికి ఉపాధి కరువవుతుంది. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ వెలుగులోకి రావడం తో పూర్తిగా ఉన్న ఉపాధి కూడా కరువై పస్తులుండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.



 ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు ప్రేక్షకులందరినీ తమ ప్రదర్శనలతో రంజింపజేసిన ఎన్నో సురభి నాటక బృందాలు ప్రస్తుతం మూగ పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొత్తంగా 50 కి పైగా ఉన్న సురభి నాటక బృందాలు గత కొన్నేళ్ల నుంచి ఒక దాని తర్వాత ఒకటి మూత పడుతూనే ఉన్నాయ్. ఇక ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఆసాంతం నాటక బృందాలు దెబ్బతిన్నాయి.  అయితే సురభి కళనే నమ్ముకుని బతుకుతున్న తమకు ప్రస్తుత ఉపాధి కరువై తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని.. ప్రభుత్వం తమ బాధను అర్థం చేసుకొని ఇప్పటికైనా ఆదుకునేందుకు ముందుకు రావాలంటూ సురభి నాటక బృందం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను వేడుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: