పవన్- పూరీ కాంబోలో మూడో సినిమా రానుందా..?
ఇదిలా ఉంటే టాలీవుడ్లో తిరుగులేని స్టార్డమ్ ఉన్నపవన్‌తో గతంలో సినిమాలు తీయాలనుకున్నా ఆయన రాజకీయాల్లోకి వెళ్లడంతో నిరాశపడిన పలువురు నిర్మాతలు ఆయన కాల్షీట్ల కోసం మరోసారి క్యూ కడుతున్నారు. వీరిలో ‘జేబీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌పై చిత్రాలు నిర్మిస్తున్న భగవాన్, పుల్లారావులకు గతంలో పవర్ స్టార్ కమిట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది తమ సినిమా ఖచ్చితంగా ఉంటుందని వారు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఇక వీరి సినిమాకు డైరెక్టర్ ఎవరన్నదానిపై కూడా వారు క్లారిటీగానే ఉన్నారట. పవన్‌కల్యాణ్ కెరీర్ తొలినాళ్లలో ఆయనతో ‘బద్రి’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన పూరీజగన్నాథ్ కే ఈ అవకాశం దక్కనున్నట్టు తెలుస్తోంది. పూరీ..పవన్‌తో తీసిన రెండోచిత్రం ‘కెమెరామన్ గంగతో రాంబాబు’ . ఈ చిత్రం అభిమానులను నిరాశపరచిన నేపథ్యంలో..ఇప్పుడు మరోసారి అవకాశమిస్తే పవర్‌స్టార్ ఇమేజ్ కు తగ్గ కథతో మూవీని తెరకెక్కించాలని పూరీ జగన్నాథ్ కసిగా ఉన్నాడట. 2024 ఎన్నికలకు ముందు పవర్ స్టార్ మరోసారి సినిమాలక బ్రేక్ ఇచ్చే అవకాశం ఉండటంతో ఈ లోపు ఈ కాంబో కార్యరూపం దాలుస్తుందో లేదో చూడాల్సి ఉంది.