ఆ ఒక్క కారణం చేత సినిమాలకు దూరమైన హీరోయిన్ ?

Divya

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు వారి నటనతో ఓవర్ నైట్ లో స్టార్ డం ను సంపాదించుకున్నారు. అయితే అలా సార్ హీరోయిన్ గా ఎదిగి, అనతికాలంలోనే సినీ ఇండస్ట్రీకి కనుమరుగైన హీరోయిన్లు కూడా చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు రచన కూడా. ఈమె మొదట జే డీ చక్రవర్తి హీరో గా నటించిన సినిమా "నేను నిన్ను ప్రేమిస్తున్నాను".ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె అగ్ర కథానాయకులు అయినటువంటి చిరంజీవి, బాలకృష్ణ,మోహన్ బాబు వంటి హీరోలతో కలిసి నటించింది. ఇక ఈమె టాలీవుడ్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి, ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది.


రచన మొత్తం అన్ని భాషలలో కలుపుకొని 200కు పైగా సినిమాలలో  నటించింది. ఇంత స్టార్డమ్ తెచ్చుకున్న రచనకు ఒక చెడ్డ అలవాటు ఉంది. ఆ అలవాటు కారణంగా  తన కెరీర్ మొత్తం నాశనం చేసుకుంది. ఆ అలవాటు ఏంటో చూద్దాం.

రచన తెలుగు సినిమాలలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్న సమయంలో ఆమె మద్యానికి బానిస అయ్యింది. అంతేకాకుండా ఈమె ధూమపానం కూడా చేసేదని కొందరు అనుకుంటున్నారు. ఇక ఈ కారణం చేతనే  ఆమెకు తెలుగులో చాలా అవకాశాలు తగ్గిపోయాయని సినీ ఇండస్ట్రీలో వినికిడి. ఇక ఈ అలవాట్లకు దూరం అయిన తర్వాత ప్రొబల్ బసు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి అయిన తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తోంది. కానీ ఈమెకు సినిమాలపై వున్న మక్కువ కారణంగా అప్పుడప్పుడు కథ నచ్చితే నటించడానికి రెడీ అవుతోంది.


రచన కు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. తన కుమారుడిని కూడా ఒక హీరోగా చేసేందుకు బెంగాల్ ఇండస్ట్రీలో యాక్టింగ్ నేర్పిస్తోందట రచన. అంతే కాకుండా అప్పుడప్పుడు సినిమా అవకాశాలు వచ్చినా సినిమాల్లో కూడా ఈమె నటిస్తోంది. టాలీవుడ్ లో నేను ప్రేమిస్తున్నా చిత్రం తీసిన తర్వాత చిరంజీవితో "బావగారు బాగున్నారా".. ఆ తరువాత "లాహిరి లాహిరి లాహిరి"వంటి సినిమాలలో నటించింది ఈ భామ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: