టాలీవుడ్ బ్యూటీ సమంత పెళ్లి తరవాత కూడా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. పెళ్లికి ముందు గ్లామర్ పాత్రలు చేసి అలరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తుంది. అంతే కాకండా సమంత సినిమా సినిమాకు తన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను మాయ చేసేస్తుంది. రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా నటించిన సమంత పల్లెటూరి అమ్మాయిలా అదరగొట్టింది. ఈ సినిమాకు సామ్ విమర్షకుల ప్రశంసలు అందుకుంది. అంతే కాకుండా ఆ తరవాత నటించిన ఓ బేబీ లాంటి సినిమాతో కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఇక సమంత ప్రస్తుతం సినిమాలే కుకుండా డిజిటల్ మాధ్యమం పైన కూడా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సమంత ఓటీటీలో టాక్ షోతో అలరించింది. ఇక ఇప్పుడు తాజాగా సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ఎన్నో అంచనాలతో నిన్న గురువారం నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ కు వచ్చిన క్రేజ్ తో ఫ్యామిలీ మ్యాన్ 2 చూసేవారి సంఖ్య పెరిగిపోయింది.
అంతే కాకుండా ఈ వెబ్ సిరీస్ తమిళుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా ఉందంటూ ట్రైలర్ చూసిన తరవాత తమిళులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ సిరీస్ పై మరింత ఆసక్తి నెల కొంది. మరోవైపు సమంత పాత్ర పై కూడా తమిళులు ట్రైలర్ చూసినప్పుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. షేమ్ ఆన్ యూ సమంత అంటూ పోస్ట్ లు పెట్టారు. కానీ నిన్ని ఈ సిరీస్ విడుదలైనప్పటి నుండి సమంత సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ సిరీస్ లో ఆమె చూపించిన యాక్టింగ్ స్కిల్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అంతే కాకుండా గతంలో ఏ సినిమా చేయనంత బోల్డ్ గా ఈ సిరీస్ లో సమంత నటించడం విశేషం. దాంతో సమంత ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.