హఠాత్తుగా తెరమరుగైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ భువనేశ్వరి ...

VAMSI
చిత్రసీమ అనేది ఒక మ్యాజిక్ ప్రపంచం. ఇక్కడ ఎంతో మంది సహాయక నటీనటులు వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరు మాత్రమే గుర్తుండిపోయే పాత్రలను చేసి తమదైన శైలిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో ఒకరు నటి భువనేశ్వరి. ఈమె తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ భాషలలో 50 సినిమాలకు పైగా నటించింది. శృంగార భరిత పాత్రలను పోషిస్తూ కుర్ర కారును హోరెత్తించిన ఈమె ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కానీ ఒకప్పుడు మాత్రం మసాలా పాత్రలు అంటే ఈమె పేరే వినిపించేది. ఈమె చిత్రమే తెరపై కనిపించేది. అంతగా మెరుపులాంటి కళ్ళతో అందరినీ ఆకర్షించింది భువనేశ్వరి. ఈమె సినిమాలలో మాత్రమే కాదు చాలా సీరియల్స్ లో కూడా నటించింది.
సీరియల్స్ లో ముఖ్యంగా లేడీ విలన్ పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. ఈమె నటించిన సినిమాలలో కుర్ కురే, బాయ్స్, దొంగరాముడు అండ్ పార్టీ, కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను వంటివి ఉన్నాయి. ఈమె ఎక్కువగా  "తన చూపులతో అవతలి వారిని ఆకట్టుకునే" పాత్రలో మాత్రమే నటిస్తూ ఉండేది. ఈమెపై గతంలో కుర్ కురే సినిమాలో నటించిన దువ్వాసి మోహన్ తో అక్రమ సంబధాలున్నట్లు వార్తలొచ్చాయి. కానీ తరువాత ఈ వార్తలను ఈమె కొట్టిపడేసింది.   ఇలా తన సినిమా ప్రయాణం సాగుతూ ఉంటే హఠాత్తుగా  2016 తర్వాత తెలుగు సినిమాలో కనిపించలేదు.

ఒకానొక సమయంలో ఈమె వ్యభిచారం చేస్తున్నదనే నేరంపై రెండు సార్లు చెన్నైలో  కేసులు కూడా నమోదు అయినట్లు వార్తలు వినిపించాయి. కానీ ఈమె నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయడానికే ఇలాంటివి చేస్తున్నారని తెలిపింది. ఇలా రకరకాల మలుపులున్న తెలుగు నటి భువనేశ్వరి ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంది. ఈమె స్వతహాగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ లో పుట్టినా, ప్రస్తుతం తమిళనాడులోనే తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: