పాడుతా తీయగా కార్యక్రమంలో.. ఎంతో మందితో పదనిసలు పలికించిన బాలు?

praveen
తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం మన మధ్య లేరు అన్న విషయాన్ని ఇప్పటికీ కూడా ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.  కాగా నేడు ఎస్పీ బాలసుబ్రమణ్యం జయంతి సందర్భంగా అందరూ ఆయనను గుర్తు చేసుకుంటున్నారు.  దాదాపు యాభై రెండేళ్ల పాటు తెలుగు సినీ పరిశ్రమలో సేవలందించారు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం. ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన అన్ని పాటలు కూడా శ్రోతులకు పంచామృతం గా మారిపోయాయి.  భక్తులను మైమరపించే చేసే భక్తి పాటలు అయినా.. ప్రేమికులను ప్రేమ లోకంలో ముంచెత్తే మెలోడీ పాటలు అయినా..  కుర్రకారు జాలి పాటలైనా..  తెలుగు మాస్ బీట్ అయిన..  అందరిని ఆలోచింప చేసే సందేశాత్మకమైన పాటలైనా వాటికి కేరాఫ్ అడ్రస్ ఎస్పీ బాలసుబ్రమణ్యం.



 కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సంగీత ప్రపంచాన్ని ఏలిన గొప్ప సింగర్ బాలసుబ్రమణ్యం. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించడమే కాదు చిత్ర పరిశ్రమకు ఎంతో మంది యువ సింగర్ ను అందించిన గొప్ప వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చూస్తే అర్థమవుతుంది. ముఖం మీద చెరగని చిరునవ్వుతో.. ఎప్పుడూ అందరితో ప్రేమగా వ్యవహరించేవారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఇక స్వయంగా పాడుతా తీయగా అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఎంతో మంది కొత్త సింగర్ కి లైఫ్ ఇచ్చారు.



 ఇక తమలో ఉన్న సంగీత ప్రతిభను నిరూపించుకోవాలని ఎంతగానో ఆశ పడిన వారికి పాడుతా తీయగా కార్యక్రమం ఒక మంచి ప్లాట్ఫాం గా మారిపోయింది.  పాడుతా తీయగా కార్యక్రమంలో జడ్జిగా, యాంకర్ గా..  యువ సింగర్స్ అందరికీ మార్గదర్శి గా నిలుస్తూ.. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. అందుకే పాడుతా తీయగా అనే కార్యక్రమం పేరు వచ్చింది అంటే చాలు ఎస్పీ బాలసుబ్రమణ్యం గుర్తులు మదిలో మెదులుతూ ఉంటాయి. ఇలా బుల్లితెరపై పాడుతా తీయగా కార్యక్రమంతో తనదైన ముద్రవేశారు ఎస్పీ బాలసుబ్రమణ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: