నిర్మాతల మీద ఒత్తిడి చేసున్న ప్రభాస్... కారణం అదే?
కానీ, ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే, ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కానున్నాయి. దీంతో విడుదలను వాయిదా వేయాలని మేకర్స్ యోచిస్తున్నారు.అయితే ప్రభాస్ మాత్రం దానికి అసలు ఒప్పుకోవట్లేదట. ఆయన ఎలాగేనా ఈ సినిమాని ముందు చెప్పిన తేదీకి తీసుకొని రావాలని చూస్తున్నాడు అని దీనికోసం నిర్మాతలని ఒత్తిడి చేస్తున్నారు అని టాక్.ఇంకా ఆలస్యం అయితే సినిమా మీద అంచనాలు తగ్గిపోతాయి అని ప్రభాస్ భావన అంట. ఈ సినిమాకి నిర్మాతలుగా యూవీ క్రియేషన్స్ ప్రభాస్ కి బంధువులే అవ్వడంతో ఈ సినిమాని త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఇక అయితే పరిస్థితి చక్కబడితే అనుకున్న తేదీకి కాకపోయినా ఈ ఏడాది దసరాకు సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలో విడుదల కానుంది అని టాక్.అలాగే ఈ సినిమాని జీ5 లో థియేటర్స్ లో ఒకేసారి విడుదల చేయాలనే ఆలోచనలో కూడా మూవీ టీం ఉన్నారు అని టాక్. అయితే ఈ విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.