ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్..

Purushottham Vinay
ఒక హీరోని స్టార్ గా నిలబెట్టాలంటే కేవలం సినిమా, సినిమా కథ మాత్రమే బాగుంటే సరిపోదు. ఆ సినిమా కథకు అనుగుణంగా పాటలు, నేపధ్య సంగీతం కూడా బాగుండాలి. అలా తమ పాటలతో, ఇంకా నేపధ్య సంగీతంతో ప్రేక్షకులను కట్టిపడేసిన సంగీత దర్శకులు ఎందరో వున్నారు. వారిలో ముందుగా చెప్పుకునే సంగీత దర్శకుడు మణి శర్మ. మణి శర్మ ఎన్నో తెలుగు సినిమాలకు సంగీతం అందించాడు. అయితే ఎక్కువ హిట్లు బాలకృష్ణ, మహేష్ బాబు సినిమాలతో అందుకున్నాడు. అప్పట్లో బాలయ్య ట్రెండ్ సెట్టింగ్ ఫ్యాక్షన్ సినిమాలకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా ఎప్పటికి శ్రోతలను ఆకట్టుకునే పాటలు అందించాడు. నరసింహ నాయుడు, చెన్న కేశవ రెడ్డి, లక్ష్మి నరసింహ పాటలు అప్పట్లో, ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అలాగే సూపర్ స్టార్ మహేష్ చాలా సినిమాలకు కూడా మణినే సంగీతం అందించాడు. మహేష్ కి సంగీతం అందించిన ప్రతి సినిమా ఆడియో పరంగా సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పటికి ఎప్పటికి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పాటలు ఎవర్ గ్రీన్ సాంగ్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఒక్కడు, అతడు, పోకిరి పాటలు అయితే ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఖుషి, గుడుంబా శంకర్ ఇంకా మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్, ఇంద్ర, జై చిరంజీవి, స్థాలిన్ వంటి సినిమాలలో పాటలు మంచి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్.


ఇలా తన సంగీతంతో స్టార్ హీరోస్ రేంజ్ ని పెంచిన సంగీత దర్శకుడు మణి శర్మ. ఇక మణి శర్మ తరువాత అతని శిష్యులు దేవి శ్రీ ప్రసాద్, థమన్ లు కూడా రెచ్చిపోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో చెప్పనవసరం లేదు.అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ లకి అదిరిపోయే పాటలు దేవి అందించాడు. ఇక థమన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటగా వెలుగు లోకి వచ్చింది కిక్ సినిమాతో అయిన మిరపకాయ్, దూకుడు సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ దూకుడు సినిమాతో థమన్ రేంజ్ మారిపోయింది. ఆ సినిమాతో థమన్ పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ఇక వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయాడు. ఇక ఇటీవల అల వైకుంఠపురంలో సాంగ్స్ యూ ట్యూబ్ లో ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లుగా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపారు. ఇప్పటికి ఊపుతున్నారు కూడా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: