తమన్ మ్యూజిక్ కి అస్సలు బ్రేక్ పడట్లేదుగా..

Purushottham Vinay
తెలుగు ఇండస్ట్రీలో టాలెంటెడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ లలో థమన్ ఒకడనే చెప్పాలి. చాలా క్వాలిటీగా ప్రతి సినిమాకి తన వంతు మంచి మ్యూజిక్ ని ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అయితే తమన్ కి బద్ధకస్తుడు అనే బ్యాడ్ నేమ్ కూడా వుంది. ఇచ్చిన మ్యూజిక్ మళ్ళీ మళ్ళీ ఇస్తాడు. కాపీ ట్యూన్స్ చేస్తాడు అని అప్పుడు చాలా విమర్శలు అందుకున్నాడు. కాని అది ఇప్పుడు కాదు. ఇప్పుడు థమన్ కు ఓపిక మామూలుగా లేదు. మంచి ఆఫర్స్ వస్తే ఏ మాత్రం రిజెక్ట్ చేయడం లేదు. ఒకప్పుడు ఆఫర్ వచ్చిన వెంటనే కథలు వినకుండా ఎలా పడితే అలా ఒప్పేసుకునేవాడు. కానీ చాలా రోజుల తరువాత గాని ఆ విషయంలో థమన్ కు క్లారిటీ రాలేదు. మంచి కంటెంట్ ఉన్న కథలను మాత్రమే ఒప్పుకోవాలని డిసైడ్ అయ్యాడు. ముఖ్యంగా అల.. వైకుంఠపురములో పాటలు హిట్టయ్యి తనకు మంచి పేరు తెచ్చిన తరువాత అతని మ్యూజిక్ లో చాలా మార్పులు వచ్చాయనే చెప్పాలి.


ప్రస్తుతం తమన్ చేతిలో మంచి సినిమాలే ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాటతో పాటు త్రివిక్రమ్ తో చేయబోయే కొత్త సినిమాకు కూడా ట్యూన్స్ అందిస్తున్నాడు. ఇక టక్ జగదీష్ విడుదలకు సిద్దంగా ఉండగా అఖండ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.అఖిల్ - సురేంధర్ రెడ్డి ఏజెంట్ తో కూడా తమన్ డప్పులు కొట్టడానికి రెడీగా వున్నాడట.ఇక ఈ సినిమాలతో పాటు పవర్ స్టార్ అయ్యప్పనుమ్ కొశీయమ్ రీమేక్  కూడా థమనే చేస్తున్నాడు.


అధికారికంగా చేతిలో ఆరు సినిమాలు సెట్ చేసుకున్న థమన్ మరో ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గోపిచంద్ మలినేని - బాలకృష్ణ కాంబినేషన్ లో రానున్న ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. క్రాక్ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వడంతో దర్శకుడు గోపీచంద్ మరో ఆలోచన లేకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ కావాలని ప్రొడక్షన్ హౌజ్ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ కు క్లారిటీ ఇచ్చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఇలా ప్రతి సినిమాకి తన మ్యూజిక్ అందిస్తూ అస్సలు బ్రేక్ పడనివ్వట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: