శ్రీకాంత్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా ?

Divya

సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది నటులు ఎన్నోకలలతో అడుగు పెడుతూ ఉంటారు. అయితే అందరి కలలు సక్సెస్ అవ్వాలని రూలేమీ లేదు. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు మొదటి సినిమాతోనే సక్సెస్ అవుతుంటారు. అలాంటి వారికి అవకాశాలు మెండుగానే వస్తాయి అనుకుంటారు. కానీ సినిమా హిట్ అయినా కొందరికి లక్ లేకపోతే ముందుకు వెళ్ళలేరు. దాంతో కొందరు ఇండస్ట్రీలోనే ఆర్టిస్టుగా కూడా చేయడానికి సిద్ధమై, అలా స్థిర పడిపోతారు. అయితే ఎంత ప్రయత్నించినా సినీ అవకాశాలు రాకపోతే కొంత మంది హీరోయిన్లు ఇండస్ట్రీని వదిలేసి దూరంగా వెళ్ళి పోతూ ఉంటారు. అలాంటివారిలో శ్రీకాంత్  హీరోయిన్ కూడా ఉన్నారు. శ్రీకాంత్ సరసన "ఒట్టేసి చెబుతున్నా" సినిమాలో హీరోయిన్ గా నటించిన "కణిక". ఈమె కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది.



తమిళనాడు రాష్ట్రంలో పుట్టి పెరిగిన కణిక, బీ టెక్ లో  మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. ఆ తర్వాత చిన్న యాడ్స్ లో నటించింది. అదే సమయంలో ఓ తమిళ మూవీ లో నటించి, తర్వాత టాలీవుడ్ కు 2003లో ఒట్టేసి చెబుతున్నా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో , అక్కడ మంచి మార్కులు సంపాదించుకుంది. కణిక తన నటనతో , అందంతో ప్రేక్షకులను అందరినీ మంత్రముగ్ధులను చేసినప్పటికీ ,అవకాశాలను మాత్రం తెచ్చుకోలేక పోయింది.


అంతేకాకుండా స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజతో కలిసి"నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్" అనే చిత్రంలో హీరోయిన్ కణిక ఒక చిన్న రోల్ లో నటించింది. ఆ తర్వాత తమిళం,మలయాళం భాషల్లో వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది ఈమె. ఇక అప్పటి నుంచి తెలుగులో సినిమాలు చేయలేదు. హీరోయిన్ ఛాన్సులు తగ్గడంతో 2008లో శ్యామ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈమె తమిళ్, మలయాళ సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ, చెన్నై లో ఓ రెస్టారెంట్ ని కూడా స్టార్ట్ చేసింది. అంతేకాకుండా తెలుగులో ఏదైనా మంచి కథ దొరికితే చేసేందుకు నాకేం అభ్యంతరం లేదంటూ చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: