ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు దానిపై ఎన్నో అంచనాలు నెలకొంటాయి. హీరోయిన్ ఎవరు, ఎంత బడ్జెట్, కథ ఎలాంటిది సినిమా ఎలా ఉంటుందని ఇలా ఎన్నో అంచనాలు ఉంటాయి. అయితే మన టాలీవుడ్ హీరోలు మహేశ్‌బాబు, ఎన్టీఆర్, బన్నిలు కూడా కొన్ని సినిమాలను మొదలు పెట్టారు. అయితే ఆ సినిమాలను పక్కన పెట్టి మరో సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. దీంతో వారి అభిమానులు కాస్త ఆశ్చర్యపోతున్నారు.
ఈ ముగ్గురు హీరోలు ముందుగా ప్రటించిన సినిమాని కాస్త వెనక్కి పెట్టి మరో సినిమాలను షూటింగ్ చేస్తున్నారు. అభిమానులకి బాగా రిజిస్టర్ అయిన వర్కింగ్ టైటిల్‌తో మరో దర్శకుడు ఆ సినిమాని తెరకెక్కించనున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దీని తర్వాత వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు ‘SSMB 27’ (వర్కింగ్ టైటిల్) మూవీ చేయాల్సి ఉంది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో అదే వర్కింగ్ టైటిల్‌తో పరశురామ్- మహేశ్ కాంబోలో సర్కారు వారి పాట సినిమా మొదలైంది. ఇక దీని తర్వాత SSMB 28 సినిమాను రాజమౌళి దర్శకత్వంలోనే ఉంటుందని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడది త్రివిక్రమ్ ఖాతాలోకి వెళ్లింది.
ఇక ఎన్టీఆర్ 30’ వర్కింగ్ టైటిల్ సినిమాను త్రివిక్రమ్ తో ప్రకటించినా.. అది కాస్తా కొరటాల శివ ఖాతాలోకి వెళ్లింది. వీరిద్దరూ కలిసి జనతా గ్యారేజ్ తర్వాత మరోసారి కలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే త్రివిక్రమ్ మహేశ్ బాబుతో చేస్తున్న సినిమా పూర్తయ్యాక తారక్‌తో చేసే అవకాశాలున్నాయి.
ఇక అల్లు అర్జున్ 21 వర్కింగ్ టైటిల్‌తో కొరటాల శివ ఓ సినిమాను ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తుండటంతో ‘ఏఏ 21’ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎలాంటి మార్పు ఉండదని చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉండగా బన్నితో ప్రముఖ తమిళ డైరెక్టర్ ఎ.ఆర్. మురగదాస్ చర్చలు జరపుతున్నారు. ఒకవేళ కథ ఓకే అయితే ఏఏ 21 సినిమా ఆయన ఖాతాలోకి వెళ్తుంది.