ఫరియా అబ్దుల్లా గురించి తెలియని విశేషాలు ఇవే..

Divya

ఫరియా అబ్దుల్లా అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది జాతి రత్నాలు సినిమా. ఈ సినిమా చూసినప్పుడు ఈ అమ్మాయిని ఎక్కడ పట్టుకొచ్చారు రా బాబు! అని అనుకున్న వాళ్లు చాలామందే.. పొడుగాటి పిల్ల.. చూడ చక్కనైన అందం.. అందరినీ ఆకట్టుకునే నటన.. ఇవన్నీ కలగలిసిన ఈ ముద్దుగుమ్మ జాతి రత్నాలు సినిమా ద్వారా బాగా పాపులారిటీ ని అందుకుంది. మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించి, చాలా సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. కానీ ఈమె పొడవుగా ఉండడం వల్ల, ఆమె సినీ జీవితానికి శాపంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలతో సరి సమానంగా ఉండాలి అంటే, అమ్మాయి కూడా హీరో కు తగ్గ హైట్ మెయింటెయిన్ చేస్తే సరిపోతుంది. అప్పుడే సినిమాలో అద్భుతమైన జోడిగా పిలువబడుతుంది. కానీ ప్రభాస్, రానా లాంటి హీరోలకు మాత్రమే సెట్ అయ్యే ఫరియా అబ్దుల్లా, మిగతా హీరోలకు ఏమాత్రం సెట్ కాదు. అందుకే ఆమే స్వయంగా కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది.

ఇక పర్యా అబ్దుల్లా జీవిత విషయానికొస్తే,1998 మే 28న హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో జన్మించింది. తండ్రి సంజయ్ అబ్దుల్లా, తల్లి కౌసర్ సుల్తానా. తన పదవ తరగతి వరకు మెరీడియన్ అండ్ భవనస్ లో పూర్తి చేసింది. ఈమె సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ తో పాటు కొన్ని యూట్యూబ్ చానల్స్ లో ప్రోగ్రామ్స్ ద్వారా బాగా పాపులారిటీ ని అందుకుంది. ఇక హైదరాబాద్ లో లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసిన ఫరియా అబ్దుల్లా.. ఈమె ఓ అందాల హైదరాబాదీ.. ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక యూట్యూబర్ గా అందరికీ పరిచయం అయినప్పటికీ, జాతి రత్నాలు సినిమా ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది..


ఇక అంతే కాకుండా ఈమె నక్షత్ర అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఈరోజు ఫరియా అబ్దుల్లా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన మరి కొన్ని ఫోటోలు మీకోసం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: