మెగాస్టార్ తో దర్శకేంద్రుడి మెగా బ్లాక్ బస్టర్ మూవీస్ ..... !!

GVK Writings
తెలుగు సినిమా పరిశ్రమలోని దిగ్గజ దర్శకుల్లో కోవెలమూడి రాఘవేంద్ర రావు కు ఒకింత ప్రత్యేకమైన పేరుంది. ముఖ్యంగా ఆయన తీసే సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉండడంతో పాటు సాంగ్స్ ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించగల దిట్ట ఆయన. ఇక తన కెరీర్ లో ఇప్పటివరకు వందకు పైగా సినిమాలు తీసి ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ దక్కించుకున్న రాఘవేంద్ర రావు అటు హిందీ, కన్నడ లో కూడా పలు సినిమా తీశారు.

ఇక టాలీవుడ్ లో ఎందరో స్టార్ హీరోలతో పలు విజయవంతమైన సినిమాలు తీసిన రాఘవేంద్ర రావు, మెగాస్టార్ చిరంజీవి కి కొన్ని అద్భుతమైన సక్సెస్ఫుల్ సినిమాలు అందించి నటుడిగా ఆయన స్థాయిని మరింతగా పెంచారు అనే చెప్పాలి. ఇక ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలకు ఆడియన్స్ లో ఎంతో అద్భుతమైన క్రేజ్ ఉండేది. ఆ విధంగా వీరిద్దరి కాంబోలో రూపొందిన మూవీస్ లో చాలా వరకు సక్సెస్ కాగా వాటిలో ఘరానా మొగుడు, మంచి దొంగ, రుద్రనేత్ర, జగదేక వీరుడు అతిలోక సుందరి, అడవి దొంగ, రౌడీ అల్లుడు, కొండవీటి రాజా వంటి సినిమాలు గొప్ప విజయాలు అందుకున్నాయి.

మరీ ముఖ్యంగా ఘరానామొగుడు, జగదేకవీరు అతిలోక సుందరి సినిమాలు అయితే చాలా కేంద్రాల్లో భారీ స్థాయి కలెక్షన్ కొల్లగొట్టడంతో పాటు పలు సెంటర్స్ లో 175 రోజుల వేడుకను జరుపుకుని పలు రికార్డులు సృష్టించాయి. ఇక అప్పట్లో చిరంజీవి మాస్ ఇమేజ్ కి తగ్గట్లుగా పక్కాగా స్టోరీ స్క్రీన్ ప్లే రాసుకుని సినిమాలు తీసి మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ మనసు కూడా గెలుచుకున్నారు రాఘవేంద్ర రావు. ఆ విధంగా టాలీవుడ్ లోని ది బెస్ట్ కాంబోల్లో మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ల కాంబో కూడా ఒకటి అని చెప్పవచ్చు..... !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: